Tarun : హీరో తరుణ్ పెళ్లి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన తరుణ్ తల్లి.. ఏమన్నారంటే..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తరుణ్. ప్రేమకథ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే సినిమాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తరుణ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ వ్యక్తిగత లైఫ్ గురించి ఏదోక న్యూస్ వినిపిస్తుంది.

Tarun : హీరో తరుణ్ పెళ్లి పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన తరుణ్ తల్లి.. ఏమన్నారంటే..
Tarun

Updated on: Jan 12, 2026 | 4:53 PM

టాలీవుడ్ సినీప్రియులకు హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన తరుణ్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. తాజాగా ఈ హీరో పేరు నెట్టింట మారుమోగుతుంది. తరుణ్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తరుణ్ పెళ్లి గురించి ఆయన తల్లి రోజా రమణి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. త్వరలోనే తన కుమారుడి పెళ్లి ఉంటుందని, మంచి అమ్మాయి దొరకగానే తెలియజేస్తామని అన్నారు.

నటుడు తరుణ్ తల్లి, ప్రముఖ నటి రోజా రమణి తన కుమారుడి వివాహం మాట్లాడుతూ.. తరుణ్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అన్నారు. “మంచి అమ్మాయి దొరికిన వెంటనే పెళ్లి చేద్దాం. త్వరలోనే ఉంటుంది” అని తెలియజేశారు. తన సినీ జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, తన వివాహం అనుకోకుండా జరిగిందని, ఆ తర్వాత నటించడం మానేశానని తెలిపారు. సింగర్ కావాలని తన జీవితాశయం అని, కానీ డబ్బింగ్ కళాకారిణిగా స్థిరపడ్డానని చెప్పారు.

ప్రస్తుత తరం నటీనటులు చాలా కష్టపడుతున్నారని రోజా రమణి అంగీకరించారు. “మా రోజుల్లో జిమ్ములు, డైట్‌లు లేవు. యాక్టింగ్ పైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు హై కాంపిటీషన్ కారణంగా యంగ్ స్టర్స్ ఫిగర్‌లు, డ్యాన్స్‌లు, ఫైట్‌ల కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు” అని అన్నారు. నటుడు ప్రభాస్ బాల్యం గురించి చెబుతూ, ఆయన తమ ఇంటి పక్కన నివసించేవారని, హీరో కాకముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్ అంతర్జాతీయ స్టార్‌గా ఎదగడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇందిరా గాంధీతో పది నిమిషాల పాటు మాట్లాడిన అనుభవాన్ని, మదర్ థెరిసా పట్ల తనకున్న అభిమానాన్ని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం తరం అమ్మాయిల్లో తనకు నటి నిత్యామీనన్ నటన అంటే ఇష్టమని, ఆమె ఎంచుకునే పాత్రలు గొప్పవని తెలిపారు.