ఆ సినిమాలో నటించొద్దు అని చెప్పాడు.. నాకంటే గొప్పా..? వంద ఛాన్స్‌లు ఇప్పిస్తా అన్నాడు
టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. విలన్ గా, సహాయక పాత్రల్లో మెప్పించిన భరణి, మిధునం సినిమాతో దర్శకుడిగానూ మెప్పించారు. కాగా గతంలో భరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

నటుడు తనికెళ్ళ భరణి గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకించి, తోటి నటుడు కోట శ్రీనివాసరావుతో తన బంధం, వారిద్దరి మధ్య పోటీ గురించిన ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కోట శ్రీనివాసరావు తనకు ఎప్పుడూ పోటీ కాదని, నిజానికి తనకన్నా, చాలా మంది నటులకన్నా ఆయన గొప్ప నటుడని తనికెళ్ళ భరణి అన్నారు. కోట శ్రీనివాసరావుతో తనకు ఉన్న బంధాన్ని వివరిస్తూ, ఆయన ఇంట్లో నాటకాలు ఆడి, ఆయన చేతిలో అన్నం తిన్న అనుబంధం ఉందని భరణి వెల్లడించారు. కొందరు తనను, కోట శ్రీనివాసరావును పోటీదారులుగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు, అది కోట శ్రీనివాసరావును బాధించిందని, స్వయంగా తన ఇంటికి వచ్చి ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారని భరణి గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగా లక్ష మైనస్‍లు ఉండొచ్చు, కానీ నటుడిగా ఆయనకు ఎప్పుడూ హ్యాట్సాఫ్ అని భరణి కొనియాడారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
ఒక చిత్రంలో కోట శ్రీనివాసరావుకు రావాల్సిన పాత్ర తనకు వచ్చిందని, అప్పుడు కోట గారు వచ్చి.. భరణి ఆ వేషం వెయ్యకు అని అన్నారు.. ఎందుకు సార్ అని అడిగా.. నన్ను తీసేసి నీకు ఇచ్చారు అని కోట శ్రీనివాసరావు అన్నారు. దానికి సారి వేషం వెయ్యకపోతే ఎలా సార్ అని అన్నాను.. దాని అంటే ఏంటి నాకన్నా గొప్పా. నేను వంద వేషాలు ఇప్పిస్తా అని అన్నారు. మీరు ఇప్పించే స్థాయిలో నేను లేను సార్ అని చెప్పాను.. దానికి అయితే వేస్తానంటావ్.. అన్నారు కోట. వేస్తాను సార్ అని చెప్పా.. ఇది మా ఇద్దరి మధ్య జరిగింది. అయితే ఆ పాత్రను కోట శ్రీనివాసరావే గొప్పగా చేయగలిగేవారని, తాను ఆ స్థాయిలో చేయలేకపోయానని భరణి అన్నారు. రంగస్థలంపై తాను, కోట శ్రీనివాసరావు కలిసి పనిచేశామని, నాటక రంగంలో తాము కోట శ్రీనివాసరావు కన్నా గొప్ప నటులమని, కానీ సినిమాల్లో కోట శ్రీనివాసరావు గొప్పని భరణి అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
సినిమాల్లో మంచి పాత్రల వల్లే నటులు ఎలివేట్ అవుతారని, ప్రకాష్ రాజ్ లాంటి వారికి రాసే పాత్రలు వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి రావడానికి పెద్దగా కష్టపడలేదని, రాళ్ళపల్లి లాంటి గురువుల వద్ద నాటకాల్లో ముందుగానే కష్టపడ్డానని తెలిపారు. తన గురువులు తనను ఎలా చూసుకున్నారో, అలాగే తాను కూడా తన శిష్యులను చూసుకోవడం ప్రారంభించానని భరణి పేర్కొన్నారు. జనార్ధన మహర్షి కూడా తన ఇంట్లోనే ఉండేవారని, తన ఇంట్లో చేరిన అసిస్టెంట్లు తన ఇంట్లోనే ఉండేవారని, చివరి వరకు తనకు 13-14 మంది అసిస్టెంట్లు ఉన్నారని భరణి తెలిపారు.
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




