Vijay Sethupathi : టాలీవుడ్‌‌‌‌‌‌లో వరుస అవకాశాలు దక్కించుకున్నటున్న మక్కల్ సెల్వన్..

తమిళ్ ఇండస్ట్రీలో  స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోతున్నాడు. తమిళ్‌లో హీరోగా కొనసాగుతూనే..

Vijay Sethupathi : టాలీవుడ్‌‌‌‌‌‌లో వరుస అవకాశాలు దక్కించుకున్నటున్న మక్కల్ సెల్వన్..
vijay-sethupathi

Updated on: Feb 16, 2021 | 6:05 PM

Vijay Sethupathi  : తమిళ్ ఇండస్ట్రీలో  స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస ఆఫర్లతో తెగ బిజీగా మారిపోతున్నాడు. తమిళ్‌లో హీరోగా కొనసాగుతూనే.. రీసెంట్గా దళపతి విజయ్‌ ‘మాస్టర్’‌ సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. అంతేకాదు.. స్టోరీ నచ్చితే చాలు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్దమేనని మరోసారి నిరూపించుకున్నాడు సేతుపతి. ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్‌ చిత్రలతో పరిచయం అయ్యాడు విజయ్‌.

తన మొదటి తెలుగు డబ్బింగ్ సినిమా ‘పిజ్జా’ తో టాలీవుడ్‌లో మంచి కలెక్షన్‌లు రాబట్టి, గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నామధ్య మెగస్టార్‌ చిరంజీవి సైరా సినిమాలో గెస్ట్‌ రోల్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.ఇక రీసెంట్‌గా ఉప్పెన సినిమాలో విలన్‌గా అదరగొట్టి.. తన మెస్మరైజ్‌ యాక్టింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేశాడు విజయ్‌ సేతుపతి. పరిపూర్ణ నటుడు అని ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి చేతే అనిపించుకున్న ఈ తమిళ హీరోకు.. తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇలా టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్‌లో కూడా వరుసగా అవకాశాలు కొట్టేస్తూ… నేషనల్ స్టార్ గా ఎదుగుతున్నాడు విజయ్‌ సేతుపతి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘నాంది’ టీజర్ చూసి షాక్ అయ్యా.. నరేష్ గట్స్ కి హ్యాట్సాప్.. నవ్విస్తూ సడన్ గా ఏడిపించడం చాలా కష్టం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us