Oscars 2026: 7 కోట్లతో తీస్తే 90 కోట్లకు పైగా వసూళ్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

2025లో చిన్న సినిమాగా సంచలనం సృష్టించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ. 90 కోట్లు రాబట్టింది. దాదాపు 1200 శాతం లాభాలను రాబట్టింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ అధికారికంగా ఆస్కార్ రేసులో నిలిచింది.

Oscars 2026: 7 కోట్లతో తీస్తే 90 కోట్లకు పైగా వసూళ్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Tourist Family Movie

Updated on: Jan 10, 2026 | 6:40 AM

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆస్కార్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ పురస్కారం అందుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 15న లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన సినిమాలను ఎంపిక చేయనున్నారు. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్‌ నుంచి ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. తన్వీ ది గ్రేట్‌, సిస్టర్‌ మిడ్‌నైట్‌, కాంతార ఛాప్టర్ 1, మహావతార్ నరసింహా చిత్రాలు ఆస్కార్ కోసం పోటీ పడుతున్నాయి. వీటి కంటే ముందు ‘హోమ్‌బౌండ్’ ఇప్పటికే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో టాప్-15 షార్ట్‌లిస్ట్‌లో నిలిచి భారీ ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఆస్కార్ రేసులో మరో భారతీయ సినిమాకు స్థానం దక్కింది. గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్‌ల పోటీలకు ఎంపికైంది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ మూవీ పోటీ పడనుంది.

నూతన దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్రీలంక నుంచి తమిళనాడుకు వచ్చిన ఒక కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఫీల్-గుడ్ ఎంటర్ టైనర్ గా ఈమూవీని రూపొందించిన దర్శకుడు అభిషన్ జీవింద్‌ను పలువురు స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ప్రశంసించారు. ఇక మే 1, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 90 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కాగా ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వివిధ భాషలలో మొత్తం 317 చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఈ చిత్రాలలో, ఆస్కార్ కమిటీ తుది పోటీకి 201 చిత్రాలను మాత్రమే ఎంపిక చేసింది. ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి