Son Of India: హీరో సూర్య చేతుల మీదుగా ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్.. సర్వం సిద్ధం చేసిన చిత్రయూనిట్..

|

Jun 03, 2021 | 11:20 PM

Son Of India Teaser: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సన్నాఫ్ ఇండియా'. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు

Son Of India: హీరో సూర్య చేతుల మీదుగా సన్నాఫ్ ఇండియా టీజర్.. సర్వం సిద్ధం చేసిన చిత్రయూనిట్..
Son Of India
Follow us on

Son Of India Teaser: డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్నాఫ్ ఇండియా’. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేసుకోవడం జరిగిందని చెప్పిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అలాగే ఇందులోని మోహన్ బాబు డిఫరెంట్ లుక్ కూడా మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. హీరో సూర్య చేతుల మీదుగా రేపు (జూన్ 4న) మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను తాజాగా వదిలారు. అయితే ఇప్పటికే మోహన్ బాబు… సూర్య కలిసి ఆకాశమే నీ హద్దురా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండగా… వెన్నెల కిషోర్ .. తనికెళ్ల ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తన కెరియర్లో తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇది అని మోహన్ బాబు చెప్పడం విశేషం.

Also Read: గబ్బిలాల్లో 5 వేల రకాల కరోనా వైరస్ లున్నాయా..2015లోనే అమెరికా చైనాలు కలిసి రహస్యంగా కరోనా వంటి వైరస్ ను సృష్టించాయా..!

Corona Third Wave: ఇప్పటి నుండీ సంసిద్ధం అయితే కరోనా మూడో వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఎస్బీఐ పరిశోధనా పత్రంలో వెల్లడి

Tollywood Heroines: ఎర్రచీరలో కుర్రాళ్ల మనసు దోచుకున్న టాలీవుడ్ తారలు.. అందానికి ఫిదా కావాల్సిందే..!

Mahesh Babu: మరో మల్టీస్టార్ కు సిద్దమవుతున్న మహేష్ బాబు.. ఈసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించనున్న సూపర్ స్టార్..