తమిళ్ హీరో శివకార్తికేయన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ అయి హిట్టయ్యాయి.. తెలుగులోనూ శివకార్తికేయన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివ.. అతి తక్కువగా సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన నటించిన రెమో మూవీ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగులోనూ శివ కార్తికేయన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో వరుణ్ డాక్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తమిళంలోనే కాదు..తెలుగులోనూ ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడమే కాకుండా.. కలెక్షన్ల్ పరంగానూ దూసుకెళ్లింది. భారీ బడ్జెట్ చిత్రాలు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది వరుణ్ డాక్టర్ మూవీ. ఇక ఈ సినిమాతో శివ కార్తికేయన్ క్రేజ్ మరోసారి మారిపోయింది. ఈ సూపర్ హిట్ మూవీ తర్వాత శివ రెమ్యునరేషన్ పూర్తిగా మారిపోయినట్లుగా సమాచారం. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ మొత్తం ఈ యంగ్ హీరో రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారిందట. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక్క సినిమాకు రూ. 27 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. హీరోగా మారిన తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read: Sneha: పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ స్నేహ.. ఆ ఇద్దరు బెదింరిపులకు పాల్పడుతున్నారంటూ..
Pushpa: పుష్ప తమిళ వెర్షన్ రైట్స్ దక్కించుకున్న లైకా.. పుష్పరాజ్ మూవీకి ఎన్ని కోట్లంటే..