AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vani Bhojan: ఊరించి.. ఊరుసుమనిపించారు.. హీరోయిన్‏కు బిగ్ షాకిచ్చిన చిత్రయూనిట్..

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram).. తన తనయుడు ధ్రువ్ (Druv) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం మహాన్ (Mahaan).

Vani Bhojan: ఊరించి.. ఊరుసుమనిపించారు.. హీరోయిన్‏కు బిగ్ షాకిచ్చిన చిత్రయూనిట్..
Vani Bhojan
Rajitha Chanti
|

Updated on: Feb 12, 2022 | 3:27 PM

Share

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram).. తన తనయుడు ధ్రువ్ (Druv) కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం మహాన్ (Mahaan). ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో విక్రమ్ మరోసారి తన నటనతో మెప్పించాడు. అలాగే విక్రమ్ తనయుడు ధ్రువ్ సైతం తన పాత్రలో జీవించేశాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఈసినిమలో ఎక్కడా కూడా హీరోయిన్ వాణి భోజన్ కనిపించకపోవడం గమనార్హం.

మహాన్ సినిమాలో ఒక్క ఫ్రేములో కూడా వాణి భోజన్ ఉండకపోడవంతో ఆమె అభిమానులు షాకయ్యారు. తమిళ్ స్టా్ర్ హీరోయిన్‏గా తనకంటూ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వాణి భోజన్ మహాన్ సినిమాలో నటిస్తుండడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురచూశారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన వాణి భోజన్ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు విశేషమైన స్పందన వచ్చింది. కానీ తాజాగా విడుదలైన సినిమాలో వాణి భోజన్‏కు సంబంధించిన చిన్న సన్నివేశం కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో చిత్రయూనిట్ ఎందుకిలా చేసింది అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహాన్ సినిమా నిడివి ఎక్కువ కావడంతో హీరోయిన్ పాత్రకు సంబంధించిన సీన్స్ అన్నింటిని తీసివేశారని టాక్ వినిపిస్తోంది. సినిమా నిడివి ఎక్కువైతే.. హీరోయిన్ పాత్రను పూర్తిగా తొలగిస్తారా ?.. ఇలా చేస్తే హీరోయిన్‏ను అవమానించినట్టే కదా అంటూ ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు.. హీరోయిన్ వాణి భోజన్ కూడా చిత్రయూనిట్ పై మండిపడినట్టుగా టాక్. ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నానని సంతోషంలో ఉన్న వాణికి సడెన్ షాకిచ్చింది చిత్రయూనిట్.

View this post on Instagram

A post shared by Vani Bhojan (@vanibhojan_)

Also Read: VK Naresh: సీఎం జగన్‏తో సినీ ప్రముఖుల భేటీపై స్పందిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..

Prabhas: పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్.. వి మిస్ యూ అంటూ..

Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్‌ లుక్‌..

Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)