Jai Bhim: ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో మళ్లీ నిరాశే.. ఆస్కార్ రేసు నుంచి జైభీమ్ సినిమా ఔట్..

|

Feb 09, 2022 | 5:41 PM

సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో మరోసారి

Jai Bhim: ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో మళ్లీ నిరాశే.. ఆస్కార్ రేసు నుంచి జైభీమ్ సినిమా ఔట్..
Jai Bhim
Follow us on

సినీ ప్రపంచంలో ఆస్కార్ అవార్డు (Oscar Award) అందుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో మరోసారి మన సినిమాలకు చోటు దక్కలేదు. ఈ ఏడాది ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు అందుకుంటుంది అనుకున్న జైభీమ్ (Jai Bhim) చిత్రం రేసు నుంచి తప్పుకుంది. తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya)..డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా.. ఈ ఏడాది జరగనున్న 94 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో చోటు దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి క్షణంలో అభిమానులకు నిరాశ ఎదురయ్యింది.

మంగళవారం ప్రకటించిన 94 ఆస్కార్ అవార్డ్స్ రేసులో జైభీమ్ సినిమా ఔట్ అయ్యింది. ట్రెసీ, ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నామినేషన్స్ వ్యాఖ్యతలుగా వ్యవహించారు. ఈ నామినేషన్స్‏లో ద పవర్ ఆఫ్ ది డాగ్ చిత్రం ఏకంగా 12 నామినేషన్స్ దక్కించుకోగా.. డ్యూన్ సినిమాకు 10, వెస్ట్ సైడ్ స్టోరీ, బెల్ ఫాస్ట్ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్స్ లభించాయి. నిన్న రాత్రి ఆస్కార్ పైనల్ నామినేషన్ జాబితా విడుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా జైభీమ్ సినిమా ప్రకటన కోసం ఎదురుచూసారు. కానీ చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ నామినేషన్స్‏లో జైభీమ్, మరక్కార్ సినిమాలకు నిరాశ తప్పలేదు. అయితే ఇతర చిత్రాలతో పోలిస్తే జైభీమ్ సినిమా స్వల్ప తేడాతోనే ఆ అవకాశం చేజారిపోయిందంట. ఇదిలా ఉంటే.. ఆస్కార్ అవార్డుల బరిలో నుంచి జైభీమ్ సినిమా జాట్ కావడంతో అభిమానులు నిరాశ చెందినప్పుటికీ.. అంతర్జాతీయ స్థాయికి దక్షిణాది సినిమా వెళ్లడం గర్వంగా ఉందంటున్నారు సూర్య అభిమానులు. అలాగే 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 సినిమాల్లో ఒకే ఒక్క తమిళ సినిమా జైభీమ్.

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సూర్య నటనకు సినీ విశ్లేషకులు.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్