ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. తమిళ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో సార్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మరోసారి సింగర్‍గా మారారు ధనుష్. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి గాయకుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మొట్ట మొదటి సారి తెలుగులో పాట పాడి ఆకట్టుకున్నారు.
అభిమానుల కోరిక మేరకు సార్ చిత్రంలో ‘మాస్టారూ.. మాస్టారూ’.. అంటూ ఎంతో చక్కగా పాట పాడి అలరించారు. తొలిసారి తెలుగులో మధురంగా తన గాత్రంతో తన కోసం వచ్చిన ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ధనుష్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.