తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. ఐశ్వర్య రజినీకాంత్ (Aishwaryaa Rajinikanth) విడాకుల ప్రకటనతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తన దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం రాత్రి ఈ జంట తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుహ్యంగా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం అటు అభిమానులకు.. సినీ ప్రముఖులకు నిరాశకు గురిచేసింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్ధరూ ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణమేంటంటూ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి.
ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్ సినీ దర్శకురాలే. అయితే ఇటీవల ఐశ్వర్య ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ధనుష్ తో చర్చించిందట. ఈ సినిమాకు ధనుష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అలాగే.. రజినీ కాంత్ హీరోగా ధనుష్.. ఇటీవల కాలా సినిమాను నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ధనుష్ అసంతృప్తిగా ఉన్నారట. ఇవే కాకుండా.. ఇటీవల గత కొద్ది రోజులుగా ధనుష్ మరో హీరోయిన్‌తో చనువుగా ఉంటున్నారని.. ఈ విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం జరిగిందని.. అదే మరింత వారిద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీసిందని సమాచారం. అయితే వీరిద్ధరి మధ్య నెలకొన్ని మనస్పర్థలను తొలగించి ఒక్కటి చేసేందుకు రజినీకాంత్ ప్రయత్నం చేశారని.. అయినా.. ఈ జంట తమ నిర్ణయాన్ని మార్చుకోలేదని వినికిడి. దీంతో చేసేదేమి లేక.. రజినీకాంత్ వారి నిర్ణయాన్ని వాళ్లకే వదిలేసారట. అయితే రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి 2017లో విశాఖన్ వణంగాముడిని రెండవ వివాహం చేసుకున్నారు.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..