Tamannaah : రిలీజ్ కు రెడీ అయిన బాబ్లీ బౌన్సర్.. తమన్నా సినిమా వచ్చేది అప్పడే

|

Jul 20, 2022 | 6:08 PM

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్సాలు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ..

Tamannaah : రిలీజ్ కు రెడీ అయిన బాబ్లీ బౌన్సర్.. తమన్నా సినిమా వచ్చేది అప్పడే
Tamannaah
Follow us on

మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaah )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్సాలు సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. మంచి విజయలను అందుకుంది. ఒకానొక సమయంలో గోల్డెన్ లెగ్ గా ఈ బ్యూటీ మారిపోయింది. దాదాపు తమన్నా నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. ఈమధ్య కాలంలో తెలుగులోనూ ఈ అమ్మడు జోరు తగ్గిందనే చెప్పలి. తెలుగులో చివరిగా గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమాలో కనిపించింది తమన్నా. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన బాబ్లీ బౌన్సర్ అనే సినిమాలో నటిస్తుంది తమన్నా.

ఈ సినిమా నుంచి తాజాగా తమన్నా లుక్ ను రిలీజ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతన్న ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ గా కనిపించనుందని తెలుస్తోంది. దర్శకుడు మధుర్ భండార్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను స్టార్ స్టూడియోస్ జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 23న ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఒక అమ్మాయి , అందులోనూ అందమైన అమ్మాయి బౌన్సర్ అయితే ఎలా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది ఈ సినిమాలో చూపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో తమన్నా బ్లాక్ అండ్ బ్లాక్ టీషర్ట్, జీన్స్ ధరించి చేతులు కట్టుకొని నిలుచుంది. ఈ పోస్టర్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి సినిమా ప్రేక్షకులను ఈ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి