
ఆమె వాడే ఖరీదైన క్రీముల వల్ల ఆ గ్లో వస్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! తన అందం వెనుక ఉన్న అసలు రహస్యం మన వంటింట్లో దొరికే సాదాసీదా పదార్థాలేనని ఆ స్టార్ హీరోయిన్ స్వయంగా వెల్లడించారు. తన తల్లి నేర్పించిన ఒక పాతకాలపు చిట్కానే ఆమె ఇప్పటికీ పాటిస్తున్నారట. మరి ఆ మ్యాజికల్ ఫేస్ మాస్క్ ఏంటి? దానిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో మంత్రముగ్ధులను చేసే తమన్నా భాటియా, సోషల్ మీడియా వేదికగా తన స్కిన్ కేర్ రొటీన్ పంచుకున్నారు. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి ఆమె శనగపిండి, పెరుగు, రోజ్ వాటర్ కలిపిన ఫేస్ మాస్క్ ఉపయోగిస్తారు. “మా అమ్మ చెప్పిన ఈ చిట్కా నా చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది” అని తమన్నా పేర్కొన్నారు.
ఈ ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే ప్రతి పదార్థం చర్మానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. శనగపిండి సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ముఖ రంధ్రాల్లో ఉన్న మురికిని తొలగించి, డెడ్ స్కిన్ సెల్స్ మాయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని రక్షిస్తాయి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా హైడ్రేషన్ అందిస్తుంది. రోజ్ వాటర్ ఒక ఉత్తమ టోనర్‌గా ఉపయోగపడుతుంది. చర్మం పీహెచ్ (pH) స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
Tamannaah Bhaatia (2)
రెండు చెంచాల శనగపిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. దానికి ఒక చెంచా గట్టి పెరుగును జోడించాలి. కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి, ఈ మూడింటిని బాగా కలిపి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో సమానంగా అప్లై చేయాలి. సుమారు అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివరగా గోరువెచ్చని నీటితో ఒకసారి కడిగితే చర్మంపై ఉన్న జిడ్డు వదిలిపోయి ముఖం తాజాగా మారుతుంది. వారంలో రెండు మూడు సార్లు ఈ రెమెడీ ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
తమన్నా గతంలో కాఫీ పొడి, తేనె కలిపిన ఎక్స్‌ఫోలియేషన్ స్క్రబ్ గురించి కూడా చెప్పారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫేస్ మాస్క్‌లు ఉపయోగించే ముందు ఒకసారి ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మానికి ఏదైనా అలర్జీ ఉంటే వీటిని వాడకపోవడమే మంచిది. మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన ఈ సింపుల్ చిట్కాతో మీరు కూడా ఈ చలికాలంలో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే సహజమైన కాంతిని పొందవచ్చు.