
స్టార్ హీరోయిన్ తమన్నా పై రీసెంట్ గా క్రిప్టో కరెన్సీ మోసం కేసులో చిక్కుకున్నారు. క్రిప్టో కరెన్సీ జనాలను మోసం చేస్తుంది అని పోలీసులకు ఫిర్యాదు అందింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు మెయిన్ బ్రాంచ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. దాంతో ఈ కేసులో తమన్నా పేరు కూడా వినిపించింది. అయితే తమన్నాను వించారించాలి అని పోలీసులు నిర్ణయించారు. తమన్నా తో పాటు కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపించింది.
తాజాగా క్రిప్టో కరెన్సీ వ్యవహారం పై తమన్నా స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె అన్నారు. ఈ వార్తలు తప్పుదారి పట్టించేవని, అలాంటి వార్తలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. నటి తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్రిప్టోకరెన్సీ, సంబంధిత కార్యకలాపాలలో నా ప్రమేయం గురించి పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని నా దృష్టికి వచ్చిందని అన్నారు. అలాగే మీడియా ఇలాంటి నకిలీ, తప్పుడు పుకార్లు, నివేదికలను స్ప్రెడ్ చేయవద్దు అని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
ఇలా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే వారి పై తగిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే చర్యలు తీసుకోవడానికి తన టీమ్ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపింది. కాగా లాభాలు చూపు జనాలను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నితీష్ జెయిన్(36), అరవింద్‌కుమార్(40)లను అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.