
హ్యాపీడేస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన చిన్నది తమన్నా(Tamannaah Bhatia).. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను సొంతం చేసుకుంది తమన్నా. దాదాపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోనూ తమన్నా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల తమన్నా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో తెలుగులో గుర్తుందా శ్రీతకాలం సినిమా ఉంది. ఈ సినిమా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఎఫ్ 3 సినిమాతో సక్సెస్ అందుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన ఎఫ్ 3 రీసెంట్‌గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా నటించింది. ఎఫ్ 2 కు మించిన ఫన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా బాయ్ గెటప్ లో కనిపించి ఆకట్టుకుంది. అబ్బాయిగా ప్యాంట్.. టీషర్ట్.. మీసాలు..హెయిర్ స్టైల్‌తో కనిపించింది. తాజాగా తమన్నా ఓ వీడియోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సరదా వీడియోలో ముందు బ్లాక్ కలర్ చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించిన తమన్నా అలా రూమ్ లోకి వెళ్లి బయటకు రాగానే అబ్బాయి గెటప్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.