Tollywood: అప్పుడు బాడీ షేమింగ్! ఇప్పుడు డేట్స్ కోసం వెయిటింగ్! ఎవరా స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న ఆ నటుల వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు దాగి ఉంటాయి. నేడు గ్లామర్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ కూడా తన కెరీర్ ఆరంభంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. తన రూపం గురించి ..

Tollywood: అప్పుడు బాడీ షేమింగ్! ఇప్పుడు డేట్స్ కోసం వెయిటింగ్! ఎవరా స్టార్ హీరోయిన్
Heroine..

Updated on: Dec 22, 2025 | 10:43 AM

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న ఆ నటుల వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు దాగి ఉంటాయి. నేడు గ్లామర్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ కూడా తన కెరీర్ ఆరంభంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. తన రూపం గురించి, తన శారీరక ఆకృతి గురించి దర్శకులు చేసిన వ్యాఖ్యలు ఆమెను ఎంతో బాధించాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసిన ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్

తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. తాప్సీ పన్ను. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మనసు విప్పి మాట్లాడింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఒక మూస పద్ధతిలో ఉండాలనే నిబంధనలు ఉంటాయని ఆమె అభిప్రాయపడింది. ముఖ్యంగా తన కురుల గురించి దర్శకులు చేసిన కామెంట్స్ తనను షాక్ కు గురి చేశాయని వెల్లడించింది. “నాకు సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటుంది. కానీ షూటింగ్ సెట్ లో దర్శకులు, ప్రొడ్యూసర్లు దీనిని అస్సలు ఇష్టపడేవారు కాదు. నా జుట్టు సరిగా లేదని, అది గజిబిజిగా కనిపిస్తుందని మొహం మీదే అనేవారు” అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

Taapsee Pannu

జుట్టు మాత్రమే కాదు, తన శరీర ఆకృతి గురించి కూడా వివక్ష ఎదురైందని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్లు అంటే ఒకే రకమైన బాడీ షేప్ కలిగి ఉండాలని, లేకపోతే అవకాశాలు ఇవ్వడం కష్టమని పరోక్షంగా చెప్పేవారని పేర్కొంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఇవ్వడానికి వెనకాడేవారని చెప్పింది. “ఆ సమయంలో నేను చాలా ఆత్మరక్షణలో పడిపోయాను. నాలో ఏదో లోపం ఉందేమో అని భయం కలిగేది. కానీ కాలక్రమేణా నా సహజత్వాన్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. నా ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను” అని ధైర్యంగా చెప్పింది.

ప్రస్తుతం తాప్సీ కేవలం నటిగానే కాకుండా ఒక పవర్‌ఫుల్ పర్సనాలిటీగా ఎదిగింది. తనను అవమానించిన వారే ఇప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. బాడీ షేమింగ్ అనేది ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో తాప్సీ మాటలు వింటే అర్థమవుతుంది. ప్రతిభ ఉన్నప్పుడు రూపం గురించి చింతించాల్సిన పనిలేదని ఆమె నిరూపించింది. నేడు ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, అవమానాలను ఎదుర్కొని నిలబడిన తాప్సీ ప్రయాణం నిజంగా అభినందనీయం.