AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించా.. వైరల్‌గా మారిన తాప్సీ కామెంట్స్

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. హిందీలో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Taapsee Pannu: ఇలాంటి రోజు వస్తుందని నేను ముందే ఊహించా.. వైరల్‌గా మారిన తాప్సీ కామెంట్స్
Taapsee Pannu
Rajeev Rayala
|

Updated on: May 02, 2025 | 8:42 PM

Share

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో తాప్సీ పన్ను ఒకరు. టాలీవుడ్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. తరువాత 2011లో, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ఆడుకలం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత తాప్సీ తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఈ బ్యూటీ 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

వస్తాడు నా రాజు, మిస్టర్ పర్‌ఫెక్ట్, సాహ‌సం,ఆనందో బ్రహ్మ, మొగుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్‌లో కాంచన 2, వై రాజా వై, గేమ్ ఓవర్ సహా తమిళ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత తాప్సీ బాలీవుడ్‌కి వెళ్లి మిషన్ మంగళ్, చాంత్ కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన సబాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

రెగ్యులర్ హీరోయిన్ అయిన తాప్సీ బేబీ, పింక్, ది ఘాజీ ఎటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న తాప్సీ పన్ను ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా తాప్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మిషా అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీని పై తాప్సీ స్పందిస్తూ.. ఇలాంటి రోజు ఒకటొస్తుందని నేను ముందే ఊహించా అని తెలిపింది. సోషల్ మీడియా పై వ్యామోహం రోజు రోజుకు పెరుగుతుంది. పేరెంట్స్ చూపిస్తున్న ప్రేమకంటే ఆన్‌లైన్‌ ప్రేమపైనే జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మనిషికి జీవితానికి మించింది వేరొకటి ఉండదు. ఫాలోవర్స్ కంటే జీవితం ముఖ్యం. కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలను సైతం లైకులు, కామెంట్స్‌ డామినేట్‌ చేస్తున్నాయి అని తాప్సీ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us