కీర్తి సురేష్ ను వెంటాడిన వీధి కుక్కలు..పాపం ఎన్ని క‌ష్టాలో

|

Jul 27, 2020 | 7:48 PM

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఇటీవ‌ల ఓటీటీ ద్వారా విమెన్ సెంట్రిక్ చిత్రం పెంగ్విన్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించారు.

కీర్తి సురేష్ ను వెంటాడిన వీధి కుక్కలు..పాపం ఎన్ని క‌ష్టాలో
Follow us on

Keerthy Suresh :జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఇటీవ‌ల ఓటీటీ ద్వారా విమెన్ సెంట్రిక్ చిత్రం పెంగ్విన్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించారు. ఈ మూవీ రిలీజ్ రోజున కీర్తి న‌ట‌నకు సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీలో మాస్క్ మ్యాన్ పాత్ర (చార్లీ చాప్లిన్ ) పాత్ర‌ను ముతాజగన్ పోషించాడు. ఇటీవల అత‌డు మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, కీర్తి సురేష్ గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పాడు.

కీర్తి సురేష్‌తో కలిసి పనిచేయడం త‌న‌కు అద్భుతమైన అనుభవం చెప్పిన ముతాజ‌గ‌న్… త‌ను చాలా గొప్ప‌ నటి అని ప్ర‌శంసించాడు. కీర్తి చాలా ఈజ్ తో న‌టిస్తుంద‌ని, ఆమె మ‌నసు కూడా క‌ల్మ‌షం లేనిద‌ని చెప్పుకొచ్చాడు. ఇక పెంగ్విన్ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు సైతం వెల్ల‌డించాడు. అనేక క‌ష్ట‌న‌ష్టాకోర్చి ఈ షూటింగులో పాల్గొన్నామ‌ని, ప‌లుసార్లు ఎద్దులు, వీధి కుక్కుల‌, తేనె టీగ‌లు మూవీ యూనిట్ పై దాడి చేశాయ‌ని తెలిపాడు. 100 పైగా తేనె టీగ‌లు త‌నను కుట్టిన‌ట్లు వివ‌రించాడు.

ఇక త‌న చార్లీ చాప్లిన్ లుక్ గురించి మాట్లాడుతూ..అది చాలా క‌ష్ట‌మైన పాత్ర అని, చార్లీ చాప్లిన్ రూపాన్ని కలిగి ఉండ‌టానికి త‌న నోరు కూడా కుట్టేసిన‌ట్టు తెలిపాడు. పాత్ర‌కు సంబంధించిన మేక‌ప్ సామాగ్రి విదేశాల నుంచి తెప్పించిన‌ట్టు వివ‌రించాడు.