సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జనవరి 16న తన ఇంట్లో కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్‌పై దుండగులు దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Saif Ali Khan

Updated on: Jan 18, 2025 | 7:14 PM

సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన బాలీవుడ్ ను కుదిపేసింది.  సైఫ్ అలీఖాన్ పై ముంబైలోని తన ఇంట్లో ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే..  ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజగా ఛత్తీస్‌గఢ్‌లో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఒక దొంగ బాంద్రాలోని సైఫ్  ఇంటిలోకి ప్రవేశించి అతనిపై దాడి చేయడంతో మెడపై వెన్నెముక పై తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

తాజాగా 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు నిందితుడిని “ముంబై-హౌరా జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ లో పట్టుకున్నారని తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు, రైలు దుర్గ్‌కు చేరుకున్నప్పుడు, అనుమానితుడు – జనరల్ కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్నాడు. – దిగివచ్చి వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ పై జనవరి 16, 2025 ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. దోపిడీ యత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందని కూడా చెబుతున్నారు. అయితే, ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంపై 6కు పైగా కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేతిపై రెండు లోతైన గాయాలు,  మెడపై ఒక లోతైన గాయం,  వెన్నెముక దగ్గర కత్తిపోటు ఉందని వైద్యులు తెలిపారు. అతని శరీరంలో కత్తి కూడా ఉంది. వైద్యులు దానిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి