Suriya Sivakumar : హీరో సూర్య సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.. ‘ఈటి’ మూవీ కోసం ఇలా..

హీరో సూర్య కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూర్య ప్రేక్షకులను అలరించారు.

Suriya Sivakumar : హీరో సూర్య సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.. ఈటి మూవీ కోసం ఇలా..
Surya

Updated on: Apr 26, 2022 | 7:14 AM

Suriya Sivakumar : హీరో సూర్య కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూర్య ప్రేక్షకులను అలరించారు. సూర్య గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఆ సమయంలోనే సుధ కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీహద్దు రా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సూర్య నటనకు మరోసారి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. అలాగే రీసెంట్ గా జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు సూర్య హీరోగా ఈటి అనే సినిమా రాబోతుంది. `ఎత్తరాకం తున్నైదావన్` చిత్రం తెలుగులో `ఈటి` టైటిల్ తో అనువాదమవుతోంది. నేరుగా తెలుగు వెర్షన్ ఆయనే డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటివరకు సూర్య తన సినిమాల్లో బ్రదర్స్ సినిమాలో తన వాయిస్ ను విపించారు. ఇప్పుడు మరోసారి తన సొంత గొంతును తెలుగులో వినిపించనున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ పూర్తయ్యిందని తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. `ఈటి`లో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకాశం నీహద్దు రా..జై భీమ్ సినిమాలు హిట్ అవ్వడంతో ఈటి పైభారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amazon Youth Offer: యూత్‌ను టార్గెట్‌ చేస్తూ అమెజాన్‌ కొత్త ఆఫర్‌.. ప్రైమ్‌పై 50 శాతం డిస్కౌంట్‌..

Raviteja vs Rekha: స్టార్ హీరోపై డైరెక్ట్ భార్య సంచలన కామెంట్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు ఇష్టమైన కొత్తిమీర మటన్ కర్రీ తయారీ విధానం మీ కోసం..