Kalki 2898 AD- Kanguva: ప్రభాస్ కల్కీని బీట్ చేసిన సూర్య కంగువా.. ఏ విషయంలో అంటే
విభిన్న కథాంశం తో తెరకెక్కుతోన్న కల్కి2898 ADకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉండనున్నాయని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న నయా మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న కల్కి2898 ADకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉండనున్నాయని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ గ్లింప్స్ కు రెస్పాన్స్ మాత్రం భారీగానే వచ్చింది కానీ వ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పుడు కల్కీను సూర్య సినిమా బీట్ చేసేసింది.
కల్కితో పాటే సూర్య నటించిన ‘కంగువా’ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ సూర్యకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే కంగువా మూవీ పై ఇక్కడ కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీ ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది’. ఈ సినిమా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచిస్తుంది. అలాగే ఈ వీడియో వ్యూస్ విషయంలో ప్రభాస్ కల్కిని బీట్ చేసింది. ‘కల్కి’ గ్లింప్స్ 21 మిలియన్ వ్యూస్ నుసొంతం చేసుకోగా.. ‘కంగువా’ గ్లింప్స్ 30 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అలాగే కంగువ మూవీ ఏకంగా 10 భాషల్లో రరిలీజ్ కానుంది.