
దక్షిణాది సినిమా పరిశ్రమలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో సూర్య- జ్యోతికల జోడి ఒకటని చెప్పవచ్చు. ఓ వైపు ఇద్దరూ యాక్టర్ గా తమ ప్రొఫెషనల్ లైఫ్ ను కొనసాగిస్తూనే మరోవైపు 20 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా తమ దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్నారీ లవ్లీక పుల్. 1999లో ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు సూర్య- జ్యోతిక. ఆ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత అది క్రమంగా ప్రేమగా చిగురించింది. ఆపై ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2006 సెప్టెంబర్ 11న పెళ్లిపీటలెక్కారు సూర్య- జ్యోతిక. ఈ నేపథ్యంలో తమ 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారీ క్యూట్ కపుల్. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చర్చిలో మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తెలుగు రుంగు దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు సూర్య- జ్యోతిక. ముఖ్యంగా తెల్లటి బ్రైడల్ గౌనులో పాలరాతి శిల్పంలా కనిపించింది జ్యోతిక. అలాగే హీరో సూర్య కూడా బ్రైడల్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.ఇక 20 ఏళ్ల పెళ్లి వేడుకల్లో భాగంగా జ్యోతిక చర్చిలోకి అడుగుపెడుతున్న సమయంలో సూర్య బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో సోదరుడు కార్తి సూర్య పక్కనే ఉంటూ అభినందనలు చెప్పడం వంటి ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒక ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న అనంతరం సూర్య- జ్యోతికలపై అందరూ పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జ్యోతిక సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘త్యాగాలు, సర్దుబాట్లు, నిస్వార్థంగా ప్రేమించుకునేందుకు.. ఒకరికోసం మరొకరు మారిన వ్యక్తిత్వాలకు ప్రతీకగా చేసుకునే వేడుక ఇది. రెండు దశాబ్దాల ప్రేమ, గిల్లికజ్జాలకు గుర్తుగా మా వాగ్దానాలను మరోసారి పునరుద్ధరించుకుంటున్నాం. మనం ప్రేమించే వ్యక్తి తనకంటే ఎక్కువగా మనల్ని గౌరవించినప్పుడు జీవితం ఓ గొప్ప బహుమతి. నా పిల్లలు దియా, దేవ్‌లకు సరైన తల్లిగా ఉంటాను. సూర్యతో నాకున్న స్నేహాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. ఆయనతో రాబోయే మరో 20 ఏళ్ల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను ‘ అంటూ సూర్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది జ్యోతిక.
జ్యోతిక, సూర్యల 20 ఏళ్ల పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కపుల్ గోల్స్ అంటే ఇలా ఉండాలని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Cutest insta post by @Suriya_offl ❤️
Congrats to a beautiful talented couple on the renewal of their wedding vows.
20 years of Love & War 🤩
Heres to many more wonderful years together 💕👏🎉🙏❤️#Surya#Jyothika#TamilCinema pic.twitter.com/nhUrOIPmKD— Shiryn💫 (@Shiryng) September 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి