Venkatesh- Rana: దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్.. వెంకటేష్-రానా హీరోలుగా త్వరలో..

|

Aug 11, 2021 | 7:30 AM

దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ ఇద్దరు వరుస సినిమాలతెజో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ కుర్రహీరోలకు పోటీగా దూకుడుగా సినిమాలు..

Venkatesh- Rana: దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్.. వెంకటేష్-రానా హీరోలుగా త్వరలో..
Rana
Follow us on

Venkatesh- Rana: దగ్గుబాటి హీరోలు రానా- వెంకటేష్ ఇద్దరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ కుర్రహీరోలకు పోటీగా దూకుడుగా సినిమాలు చేస్తూ జోరుమీదున్నరు. ఇక యంగ్ హీరో రానా కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ  స్పీడ్ పెంచారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాత్మక కథలను కూడా చేస్తున్నాడు రానా. ఇక వెంకటేష్ విషయానికొస్తే ఇటీవలే నారప్ప సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ దగ్గుబాటి హీరోలకు సంబందించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ కోసం ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. వెంకీ – రానా – సురేష్ బాబు పలు ఇంటర్వ్యూలలో ఈ మల్టీస్టారర్ గురించి వెల్లడించారు. తాజాగా ఈ మల్టీస్టారర్‌‌‌‌‌‌‌‌కు మంచి కథ దొరికిందని టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ – రానాలతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ మంతనాలు జరుపుతోందట. ఈ వెబ్ సిరీస్‌‌‌‌కు అద్భుతమైన కథ కూడా దొరికిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం దగ్గుబాటి హీరోలు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేయడానికి సురేష్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రానా వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్‌‌‌‌‌గా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..