
తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది దర్శించుకుంటారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా గంటల కొద్దీ మరీ క్యూలో నిలబడి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. కేవలం సామాన్యులే కాదు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తుంటారు. కొందరు వీఐపీ, వీవీఐపీ హోదాలో నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే మరికొందరు సామాన్య భక్తుల్లా తిరుమల మెట్లు ఎక్కుతూ ఏడు కొండల స్వామికి మొక్కలు చెల్లించుకుంటారు. ఇంకొందరయితే మోకాళ్లపై నడుస్తూ వేంకటేశ్వర స్వామిని చేరుకుంటారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా మోకాళ్లపై నడుస్తూ తిరుమల కొండను చేరుకుంది. అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఈ హీరోయిన్ దైవభక్తికి ఫిదా అవుతున్నారు. మరీ ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సుప్రీత.. అదే నండి సీనియర్ నటి సురేఖా వాణి కూతురు.
సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లయినా ఇక్కడకు వస్తుంటారు తల్లీ కూతుళ్లు. అలా లేటెస్ట్ గా మరోసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు సురేఖా వాణి, సుప్రిత. అయితే ఈసారి సుప్రిత మాత్రం మోకాళ్లపై నడుస్తూ వెళ్లి మరీ ఏడుకొండల వాడిని దర్శించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.
కాగా సహాయక నటిగా వందలాది సినిమాల్లో నటించిన సురేఖా వాణి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే ఆమె కూతురు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానుంది. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా తెరకెక్కుతోన్న ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు మరో సినిమాకు కూడా సైన్ చేసిందీ స్టార్ కిడ్ . త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.