Sree Leela: వివాదంలో పెళ్ళిసందD హీరోయిన్…శ్రీలీల నా కూతురు కాదంటూ…

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్,

Sree Leela: వివాదంలో పెళ్ళిసందD హీరోయిన్...శ్రీలీల నా కూతురు కాదంటూ...
Srileela

Updated on: Oct 17, 2021 | 12:48 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. దసరా సందర్బంగా విడుదలైన ఈ మూవీ సక్కెస్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి సినిమా విడుదల కంటే ముందే శ్రీలీల తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. శ్రీలీల తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి సందD సినిమా విడుదల కాకముంద శ్రీలీలకు తెలుగు ఆఫర్లు క్యూ కట్టాయి.. కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో ఈ ముద్దుగుమ్మ వివాదంలో ఇరుక్కుంది…

శ్రీలీల నా కూతురు కాదంటూ సూరపనేని శుభాకర రావు వాదిస్తున్నారు.. శ్రీలీల తన కూతురంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కండిస్తూన్నారు. సూరపనేని ఫౌండేషన్ పేరుతో ఇన్విటేషన్ కార్డ్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సూరపనేని శుభాకర రావు అన్నారు.. శ్రీలీల తన మాజీ భార్య కూతురని.. తాము విడిపోయిన తరువాత శ్రీలీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని తెలిపారు. తన ఆస్తులపై క్లైమ్ చేయడానికి తన పేరు వాడుతున్నారని..ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని.. ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు.. తమ విడాకుల కేసులో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లినట్లుగా సూరపనేని శుభకరరావు తెలిపారు… అలాగే.. శ్రీలీల తన కూతురంటూ జరుగుతున్న ప్రచారం పై సూరపనేని సొసైటీ కి కూడా కంప్లైంట్ చేసానని తెలిపారు..

Sreeleela

శ్రీలీల..  తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో సెటిల్ అయ్యింది.  ముంబైలో డాక్టర్ చదువుతుంది ఈ బ్యూటీ.

Also Read: Happy Birthday Keerthy Suresh: కీర్తి సురేష్ బ‌ర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ

Manchu Vishnu-Pawan Kalyan: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ

Alai Balai: దత్తన్న అలయ్‌ బలయ్‌ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ముఖ్య అతిధిగా పాల్గొన్న పవన్‌ కళ్యాణ్