AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐడీ కార్డులో ఉన్న హీరోని గుర్తుపట్టారా? తెరపై బొమ్మ కనిపిస్తే బాక్సాఫీస్ షేకాడాల్సిందే!

‘శివాజీ రావు గైక్వాడ్’ పేరుతో ఉన్న ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఐడీ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్డులో ఉన్నది చిత్రసీమను షేకాడించే హీరోమరి. ఆయన బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజుల నాటి పాత ఐడీ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ రీతిలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా?

ఈ ఐడీ కార్డులో ఉన్న హీరోని గుర్తుపట్టారా? తెరపై బొమ్మ కనిపిస్తే బాక్సాఫీస్ షేకాడాల్సిందే!
Rajinikanth bus conductor ID card
Srilakshmi C
|

Updated on: May 29, 2026 | 8:39 AM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్‌ తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీ, మేనరిజమ్‌తో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఓ సాధారణ బస్సు కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం భారత సినీ పరిశ్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఎందరికో ఆదర్శం. స్టార్‌డమ్‌తో ఉన్నత శిఖరాలను అధిరోహించినా మూలాలను మర్చిపోని వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన బస్సు కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన దశాబ్దాల నాటి బస్ కండక్టర్ ఐడీ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ రంగంలోకి రాకముందు సాధారణ జీవితాన్ని గడిపిన రజనీకాంత్ ప్రయాణాన్ని గుర్తు చేస్తూ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఐడీ కార్డు 1971 సంవత్సరం నాటిది. బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS)కి చెందిన ఈ ఐడీ కార్డులో రజనీకాంత్ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’గా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆయన బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసేవారు. ఐడీ కార్డులో ఆయన కండక్టర్ బ్యాడ్జ్ నంబర్‌తో పాటు విధుల వివరాలు కూడా ఉన్నాయి. అప్పట్లో బెంగళూరులోని రూట్ నంబర్ 10Aలో ఆయన విధులు నిర్వహించినట్లు అందులో కనిపిస్తుంది. బస్సు కండక్టర్‌గా పనిచేసే రోజుల్లోనే రజనీకాంత్ తన ప్రత్యేక స్టైల్‌తో జనాల దృష్టిని ఆకర్షించేవారని ఆయన పాత స్నేహితులు ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. టిక్కెట్లు ఇచ్చే తీరు, విజిల్ వేయడం, గాల్లోకి నోట్లను విసురుతూ టిక్కెట్లు చించడం, ప్రయాణికులతో సరదాగా మాట్లాడటం వంటి మేనరిజమ్స్ అప్పట్లోనే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అదే స్టైల్ తర్వాత వెండితెరపై ఆయనకు అపారమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత రజనీకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన త్వరిత కాలంలోనే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం కోట్లాది రూపాయలు పారితోషికంగా అందుకుంటున్నా.. గతాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ పలు సందర్భాల్లో తన కష్టకాలంలో అండగా నిలిచిన తన స్నేహితుడు రాజ్ బహదూర్‌ను రజనీకాంత్ ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ పాత ఐడీ కార్డు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణంగా అతిపెద్ద సినీ నటులలో ఒకరిగా ఎదిగిన రజనీకాంత్ ప్రయాణాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రజనీ పాత ఐడీ కార్డు ఇప్పుడు కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా మారింది. కష్టపడి ఎదిగితే ఎంతటి ఉన్నత స్థానానికైనా చేరుకోవచ్చని రజనీకాంత్ జీవితం మరోసారి నిరూపించిందని అభిమానులు పేర్కొంటున్నారు. బెంగళూరు బస్సుల్లో టికెట్లు కొట్టిన వ్యక్తి, ఆ తర్వాత సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచి సూపర్ స్టార్‌గా ఎదగడం నిజంగా అసాధారణ ప్రయాణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వంలో మరో మువీలో కూడా రజనీకాంత్ నటించనున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు