Super Star Rajinikanth: షూటింగ్ లో బిజీగా సూపర్ స్టార్.. మాస్ లుక్ అదరగొడుతున్న రజినీకాంత్..

సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాతే'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల సూపర్ స్టార్ ఆరోగ్యం దెబ్బతినడంతో రజిని షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

Super Star Rajinikanth: షూటింగ్ లో బిజీగా సూపర్ స్టార్..  మాస్ లుక్  అదరగొడుతున్న రజినీకాంత్..
Superstar Rajinikanth

Updated on: Apr 12, 2021 | 7:18 PM

Rajinikanth: సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాతే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఆరోగ్యం దెబ్బతినడంతో రజినీకాంత్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎదో ఒక రకంగా సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంతలో సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో సినిమా షూటింగ్ కు  బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. అంతా పూర్తయి మరి కొద్దిరోజుల్లో పార్టీ పేరు అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. చకచకా ‘అన్నాతే’ షూటింగ్ ను కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడదాం అనుకునే టైంలో రజినీ ఆరోగ్యం దబ్బతిన్నది. దాంతోఆయన ఆసుపత్రిపాలయ్యారు.

ఆ తర్వాత కోలుకున్న ఆయన ఇక రాజకీయాలకు తన ఆరోగ్యం సహకరించిందని నిర్నయిన్చుకొని రాజకీయాలోకి ఎంటర్ అవ్వను అని ప్రకటించారు. దేవుడే తనకు వార్నింగ్ ఇచ్చాడని అందుకే రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదని సూపర్ స్టార్ ప్రకటించారు. దాంతో రజినీ అభిమానులు సూపర్ స్టార్ ఆరోగ్యమే తమకు ముఖ్యం అంటూ స్టేటమేట్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ స్టార్ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఆయన సెట్ లో ఉన్న ఫోటోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.  భారీ బడ్జెత్బ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ కళానిధిమారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Adipurush: శ్రీరామనవమి రోజు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్న డార్లింగ్.. ! గట్టిగా ప్లాన్ చేశారుగా..

Uppena Movie: డిజిటల్ స్ట్రీమింగ్‌‌‌కు సిద్దమైన సూపర్ హిట్ ప్రేమకథ.. ఓటీటీలోకి ‘ఉప్పెన’ సినిమా.. ఎప్పుడంటే..

Sunny Leone: ‘పదమూడేళ్ల అనుబంధం.. పదేళ్ల వివాహ జీవితం’… ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సన్నీ లియోన్‌..