AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: ‘పదమూడేళ్ల అనుబంధం.. పదేళ్ల వివాహ జీవితం’… ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సన్నీ లియోన్‌..

Sunny Leone: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా భారతీయులకు పరిచయమయ్యారు సన్నీ లియోన్‌. ఈ రియాలిటీ షోలో తన గ్లామర్‌తో పాటు ఆటతీరుతోనూ ఆకట్టుకున్న సన్నీ.. అనంతరం భారతీయ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఓవైపు హీరోయిన్‌గా...

Sunny Leone: 'పదమూడేళ్ల అనుబంధం.. పదేళ్ల వివాహ జీవితం'... ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన సన్నీ లియోన్‌..
Sunny Leone Emotional Post
Narender Vaitla
|

Updated on: Apr 12, 2021 | 5:51 PM

Share

Sunny Leone: బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా భారతీయులకు పరిచయమయ్యారు సన్నీ లియోన్‌. ఈ రియాలిటీ షోలో తన గ్లామర్‌తో పాటు ఆటతీరుతోనూ ఆకట్టుకున్న సన్నీ.. అనంతరం భారతీయ సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపిస్తూ అందరినీ మెస్మరైజ్‌ చేశారు. రోజురోజుకీ తన పాపులారిటీ పెంచుకుంటూ పోయిన ఈ అందాల తార కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలుగుతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ తళుక్కుమంది. ఇక సన్నీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే సన్నీ.. తన వృత్తి పరమైన విషయాలతో పాటు వ్యక్తిగతమైన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.

సన్నీ లియోన్‌ 2011లో డేనియల్‌ వెబర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట పెళ్లి పీటలెక్కి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డేనియల్‌ సన్నీకి అద్భుతమైన బహుతమిని ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ఏకంగా డైమాండ్ నెక్లస్‌తో తన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న సన్నీ ఒక వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో సన్నీ మాట్లాడుతూ.. ‘మన పెళ్లి రోజున ఈ డైమండ్‌ నెక్లెస్‌ ఇచ్చినందుకు ప్రియమైన శ్రీవారికి ధన్యవాదాలు. ప‌ద‌మూడేళ్ల అనుబంధంలో ప‌దేళ్ల వివాహ జీవితం మ‌నది. ఇదంతా నిజంగా ఓ కలలా ఉంది. మనం అనుకున్నట్లుగానే జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో సన్నీ అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

సన్నీ లియోన్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

Also Read: Ramadan month: రంజాన్ నెల ప్రారంభానికి ముందే ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…

CM KCR Sagar Meeting: సీఎం కేసీఆర్ సాగర్ సభకు తొలగిన అడ్డంకి.. సభను రద్దుకు దాఖలైన పిటిషన్ల విచారణకు హైకోర్టు నిరాకరణ..!

Cutting down trees : కీసర మండలంలో అనుమతి లేకుండా చెట్లు కొట్టినందుకు ఫైన్ ఎంతో తెలుసా.. అక్షరాలా లక్షల్లోనే..!