Jailer Movie: బాక్సాఫీస్ దగ్గర జైలర్ ఊచకోత.. ఆరు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

జైలర్ సినిమా భారీ విజయం సాధించడంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది జైలర్. ఇక ఈ మూవీకి తొలి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓపినింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేశారు రజినీకాంత్. తొలి రోజే ఈ సినిమా 93 కోట్ల వరకు వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Jailer Movie: బాక్సాఫీస్ దగ్గర జైలర్ ఊచకోత.. ఆరు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
Jailer Movie OTT

Updated on: Aug 17, 2023 | 9:58 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జైలర్ సినిమా భారీ విజయం సాధించడంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది జైలర్. ఇక ఈ మూవీకి తొలి రోజు నుంచే అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓపినింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేశారు రజినీకాంత్. తొలి రోజే ఈ సినిమా 93 కోట్ల వరకు వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మన దగ్గర మొదటి రోజు 10 కోట్ల వరకు వసూల్ చేసింది జైలర్. ఇక ఈ సినిమా ఆరు రోజులకు ఎంత వసూల్ చేసిందో తెలుసా..?

నైజాం 13.23 కోట్లు, సీడెడ్ 3.74 కోట్లు, ఉత్తరాంధ్ర 3.62 కోట్లు, ఈస్ట్ 1.82 కోట్లు, వెస్ట్ 1.13 కోట్లు, గుంటూరు 2.09 కోట్లు, కృష్ణా 1.83 కోట్లు, నెల్లూరు 0.89 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 28.35 కోట్ల షేర్ ను వసూల్ చేసింది జైలర్ సినిమా.

ఇక జైలర్ సినిమాలు తెలుగులో భారీ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. జైలర్ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమానిర్మకు రూ.16.15 కోట్ల మేర భారీ లాభాలు వచ్చాయని టాక్ వినిపిస్తుంది. ఇక ఓవర్ ఆల్ గా గ్రాస్ 412 కోట్లకు వసూల్ చేసిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.