Rajinikanth: 33 ఏళ్ల తర్వాత ఇలా.. వైరల్ అవుతోన్న అమితాబ్, రజినీకాంత్ వర్కింగ్ స్టైల్

ఇప్పుడు సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అలాగే కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లాల్ సలాం అనే సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు జై భీం లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Rajinikanth: 33 ఏళ్ల తర్వాత ఇలా.. వైరల్ అవుతోన్న అమితాబ్, రజినీకాంత్ వర్కింగ్ స్టైల్
Amitabh Bachchan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2023 | 7:02 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా రీసెంట్ జీఫా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. సెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ఏకంగా 700 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అలాగే కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లాల్ సలాం అనే సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు జై భీం లాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తలివార్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను కేరళ లో జరిపారు. ఆతర్వాత అక్కడి నుంచి ముంబై కి షిఫ్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత అమితాబ్ , రజినీకాంత్ కలిసి నటిస్తున్నారు.  1991లో వచ్చిన  హిందీ చిత్రం ‘హమ్‌’ సినిమాలో రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్ కలిసి నటించారు ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు స్క్రీన్ పై సందడి చేయనున్నారు.

ముంబై లో షెడ్యూల్ పూర్తి చేశారు మూవీ టీమ్. ఈ విషయాన్నీ తెలుపుతూ రజినీకాంత్, అమితాబ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమితాబ్ తన ఫోన్ లో సూపర్ స్టార్ కు ఎదో చూపిస్తున్న ఓ వర్కింగ్‌ స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రానా, ఫాహద్‌ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.