
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను బరిలోకి దించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఊర మాస్ మసాలా పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ బాబు అభిమానులు.
మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ మహేష కాంబోలో వచ్చిన మొదటి సినిమా అతడు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు నటన ఆడియన్స్ ను మెప్పించింది. ఈ మూవీ థియేటర్స్ లో కనే టీవీలో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే మహేష్ త్రివిక్రమ్ కలిసి ఖలేజా అనే సినిమా చేశారు. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా అతడు మాదిరిగానే థియేటర్స్ లో పర్లేదు అనిపించుకుంది కానీ టెలివిజన్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ రెండు సినిమాల కంటే భిన్నంగా ఇప్పుడు గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు తాజాగా బిగ్ సి 20 ఇయర్స్ వేడుకలో పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు పలు విషయాలను పంచుకున్నారు.
తన ఫోన్ రింగ్ టోన్ ఏంటి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం తో ఆసక్తికర సమాధానం చెప్పారు మహేష్. తన ఫోన్ రింగ్ టోన్ సైలెంట్ అని ఫన్నీగా రిప్లే ఇచ్చారు మహేష్. దాంతో అక్కడ ఉన్నవారు నవ్వేశారు. షూటింగ్స్ తో బిజీగా ఉంటాను కాబట్టి ఎప్పుడు నా ఫోన్ సైలెంట్ లోనే ఉంటుందని అన్నారు మహేష్ బాబు. ఇక గుంటూరు కారం సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి సినిమా ఖచ్చితంగా వస్తుందని తెలిపారు సూపర్ స్టార్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.