Adiseshagiri Rao: ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే నంది అవార్డ్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు

|

May 01, 2023 | 12:42 PM

ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించిన సూపర్ స్టార్ గత ఏడాది నవంబర్ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అధికారికంగా ప్రకటించారు.

Adiseshagiri Rao: ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే నంది అవార్డ్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు
Adiseshagiri Rao
Follow us on

ఇటీవల ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హావ నడుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతూ మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించిన సూపర్ స్టార్ గత ఏడాది నవంబర్ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 31న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు మూవీ రీ-రిలీజ్ చేస్తున్నాం. కృష్ణ గారి అభిమానుల కోరిక మేరకే ఈ మూవీని మళ్ళీ థియేటర్ లలోకి తీసుకొస్తున్నాం అన్నారు.

1971 లో రిలీజ్ అయిన మూవీ ఇది. ఫస్ట్ ఇండియన్ కౌ బాయ్ మూవీ ఇదే కావడం విశేషం. అలాగే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ కూడా ఇదే.  ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి టెక్నాలజీ అందించిన గొప్ప హీరో కృష్ణ. అలాగే కృష్ణ గారి పేరుమీద బుర్రిపాలెం లో ఓల్డేజ్ హోమ్ కడుతున్నాం అని తెలిపారు. అదేవిధంగా కృష్ణ గారి గురించి మాట్లాడుతూ.. ఆయన కి ఎలాంటి కోరికలు లేవు. ఏ అవార్డ్ లపై ఆసక్తి ఉండేది కాదు. ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే అవార్డ్స్ ఇస్తున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డ్స్ ని పట్టించుకోట్లేదు అన్నారు ఆదిశేషగిరిరావు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోట్లేదు. ప్రభుత్వ అవార్డ్స్ కి పెద్దగా ప్రాధాన్యత ఉంది అని నేను అనుకోవట్లేదు. మీడియా వాళ్ళు కూడా ఇష్యు ని డైవర్ట్ చేసి తిట్టించుకుని వ్యూస్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా అలానే అయిపోయింది అని షాకింగ్ కామెంట్స్ చేశారు.