Superstar Krishna: ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు.. అనుకున్న బ‌డ్జెట్‌లో చేసేవారు : సూపర్ స్టార్ కృష్ణ

|

Nov 20, 2021 | 7:52 AM

పాన్ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న జోనర్‌ ఫోక్‌లోర్‌. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య.

Superstar Krishna: ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు.. అనుకున్న బ‌డ్జెట్‌లో చేసేవారు : సూపర్ స్టార్ కృష్ణ
Krishna
Follow us on

Vithalacharya : పాన్ వరల్డ్ లెవల్లో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న జోనర్‌ ఫోక్‌లోర్‌. తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న చరిత ఆయన సొంతం. ఆయన ఎవరితో సినిమాలు చేసినప్పటికీ… ఆ సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయన మేకింగ్‌ మీద సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అలాంటిది. అందుకే విఠలాచార్య దర్శకత్వం వహించినా, నిర్మించినా… ఆ సినిమాలను ప్రదర్శించే థియేటర్లు హౌస్‌ఫుల్స్ తో కళకళలాడేవి. తరాలు మారినా ఆయన సినిమాలను చూడని, పొగడని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో! దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరించి, ఆస్వాదిస్తున్న విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఆ సమగ్ర పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు.

‘జై విఠలాచార్య’ ఫ‌స్ట్‌లుక్‌ ఆవిష్కరించిన అనంతరం సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ “విఠలాచార్య గారి దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయ్యింది అన్నారు. నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో ఆయన సినిమాలు చాలా చూశాను. కాంతారావు గారు హీరోగా ఆయన చాలా జానపద సినిమాలు చేశారు. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేశాను. జానపద నేపథ్యంలో చేసిన సినిమాలు చాలా తక్కువ. ‘ఇద్దరు మొనగాళ్లు’ కాకుండా ‘మహాబలుడు’, ‘బొమ్మలు చెప్పిన కథ’, ‘సింహాసనం’ సినిమాలు చేశాను. ‘గూఢచారి 116’ విడుదలైన 40 రోజులకు అనుకుంటా… ‘ఇద్దరు మొనగాళ్లు’ ఓకే చేశా. నేను చేసిన ఫస్ట్ మల్టీస్టారర్ కూడా ఇదే అన్నారు. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే, స‌క్సెస్‌ఫుల్ నిర్మాతగా ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. అనుకున్న బ‌డ్జెట్‌లో సినిమాలు తీసేవారు. ఒక దర్బార్ సెట్ వేస్తే… అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. ఆయన ఏ సినిమాకు అయినా ఒకటే సెట్ వేసేవారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వాహినీ స్టూడియోస్‌కు వచ్చేవారు. నా షూటింగులు ఎక్కువ అక్కడే జరిగేవి. మా సెట్‌కు వ‌చ్చి కూర్చుని, నాతో సరదాగా కబుర్లు చెప్పేవారు. బీఎన్ రెడ్డిగారు, చ‌క్ర‌పాణిగారు కూడా అలా సెట్స్‌కు వ‌చ్చి కూర్చునేవారు. విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది” అని అన్నారు సూపర్ స్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌.

Priya Prakash Varrier: కైపెక్కించే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న అందాల ప్రియా..

Anasuya Bharadwaj: చీర కట్టుతో ఫాన్స్ మనసులను దోచుకుంటున్న అను లేటెస్ట్ ఫొటోస్..