నందమూరి నటసింహం బాలకృష్ణ సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్నేహితుడు బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “యాక్షన్ కింగ్.. కలెక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. నా లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ ఇలాగే ముందుకు వెళ్లాలి. ఇది చాలా గొప్ప విషయం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా, ఆనందంగా ఆయన జీవించాలని కోరుకుంటున్నాను.. ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రజినీ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరోవైపు బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలను మరింత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు ఫ్యాన్స్.
బాలకృష్ణ తొలి చిత్రం తాతమ్మ కల. ఈ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు నందమూరి నటసింహం. ఈ మూవీ విడుదలై నేటికి 50 ఏళ్లు అవుతుంది. యాక్షన్, ఫ్యాక్షన్, పౌరాణికం, ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నోసార్లు విభిన్న కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. సినిమా ప్రపంచమే కాకుండా సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. కష్టాల్లో ఉన్న అభిమానుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఇదిలా ఉంటే తమ అభిమాన నటుడు సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి కావడంతో సినీ స్వర్ణోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని టాలీవుడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఆదివారం జరగనున్న ఈ వేడుకకు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అఖిల్, గోపీచంద్, సిద్ధు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్ వంటి తారలతోపాటు కోలీవుడ్ స్టార్స్ కూడా హాజరుకానున్నారు. బాలయ్య చివరగా భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యానిమల్ విలన్ బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను ప్రకటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.