AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ఇదికదా కిక్ అంటే..! రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఎనిమిది గెటప్స్

మహేష్ బాబు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..మహేష్ , రాజమౌళి కాంబినేషన్ మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంకా టైటిల్ రివీల్ చేయని ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది.

Mahesh Babu : ఇదికదా కిక్ అంటే..! రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఎనిమిది గెటప్స్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2024 | 8:42 AM

Share

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..మహేష్ , రాజమౌళి కాంబినేషన్ మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంకా టైటిల్ రివీల్ చేయని ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. దాంతో మహేష్ ఫ్యాన్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు 8 గెటప్‌లలో కనిపిస్తారని అంటున్నారు . రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో గెటప్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకోసం హీరోలు రాత్రి పగలు కష్టపడాలి. ఇప్పుడు మహేష్ బాబు కూడా దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 గెటప్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు గాసిప్‌లు వినిపిస్తున్నాయి.

ఇది మహేష్ బాబుకి 29వ సినిమా. అందుకే దీనిని ‘SSMB 29’ అని వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్ ఏదీ రివీల్ కాలేదు. అందుకే రాజమౌళి కొన్ని షరతులు పెట్టాడని అంటున్నారు. మహేష్ బాబు పబ్లిక్ గా కనిపించ వద్దని రాజమౌళి కండీషన్ పెట్టారట. దాంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కు కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. మహేష్ బాబు సినిమాలకు గ్యాప్ వచ్చిన సోషల్ మీడియా ద్వారా.. లేదంటే యాడ్స్ ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రాజమౌళి సినిమానుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు మహేష్ బాబును చూడలేము అని తెగ ఫీలవుతున్నారు ఫ్యాన్స్. మామూలుగానే జక్కన్న సినిమాలకు హీరోల దగ్గర నుంచి నాలుగు ఐదేళ్లు కాల్ షీట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుతో ఎన్నేళ్లు సినిమా చేస్తారో అని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారట. అలాగే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత