Journey Movie: మళ్లీ వచ్చేస్తోన్న సూపర్ హిట్ సినిమా.. ‘జర్నీ’ రీరిలీజ్ ఎప్పుడంటే..

|

Feb 12, 2024 | 8:48 AM

తమిళం, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఎమోషనల్ డ్రామాను మళ్లీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2011లో 'ఎంగైయుమ్ ఎప్పోథుమ్' మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకుంది. దీనిని తెలుగులో జర్నీ పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్త నటీనటులతో డైరెక్టర్ ఎం. శరవణన్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ అందరి హృదయాలను హత్తుకుంది.

Journey Movie: మళ్లీ వచ్చేస్తోన్న సూపర్ హిట్ సినిమా.. జర్నీ రీరిలీజ్ ఎప్పుడంటే..
Ourney Movie
Follow us on

రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ దూకుడుపెంచింది. కొన్నాళ్లుగా భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించగా.. ఈ రీరిలీజ్ గురించి అడియన్స్ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాలెంటైన్ వీక్ నడుస్తుండడంతో ఒకప్పుడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న లవ్ స్టోరీ చిత్రాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఓయ్, సీతారామం, 96 సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సూపర్ హిట్ కూడా థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అదే ‘జర్నీ’. తమిళం, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఎమోషనల్ డ్రామాను మళ్లీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 2011లో ‘ఎంగైయుమ్ ఎప్పోథుమ్’ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకుంది. దీనిని తెలుగులో జర్నీ పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న కొత్త నటీనటులతో డైరెక్టర్ ఎం. శరవణన్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ అందరి హృదయాలను హత్తుకుంది. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చేంమదుకు రెడీ అయ్యింది.

వాలెంటైన్స్ డే సందర్భంగా పలు చిత్రాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని లవ్ స్టోరీస్ ఫిబ్రవరి 14న మళ్లీ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక జర్నీ సినిమాను మార్చి నెలలో మరోసారి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ నిర్మించగా.. సి.సత్య సంగీతం అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో వత్సన్, చక్రవర్తి, వినోదినీ వైద్యనాథన్, రవి కీలకపాత్రలు పోషించారు. జై అంజలి, శర్వానంద్.. అనన్య మధ్య లవ్ స్టోరీ.. ఓ యాక్సిడెంట్ వీరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అనేది జర్నీ మూవీ స్టోరీ.

ఎంతో ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు డైరెక్టర్ శరవణన్. మనసులను హత్తకునే రెండు ప్రేమకథలు… ఊహించని బస్సు ప్రమాదం.. గుండెల్ని పిండేసే భావోద్వేగం..అన్ని అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేశాడు. బుల్లితెరపై ఇప్పటికీ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ మూవీ మరోసారి బిగ్ స్క్రీన్ పై అలరించేందుకు రెడీ అయ్యింది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.