Vimanam: విమానం నుంచి ‘సుమతీ’ సాంగ్ రిలీజ్.. కీలకపాత్రలో అనసూయ..

|

May 22, 2023 | 5:50 PM

తాజాగా ఈ సినిమా నుంచి సుమతీ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ అనసూయ పోషించిన సుమతీ పాత్రపై సాగుతుంది. 'సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడమే కాదు .. ఆయనే ఆలపించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Vimanam: విమానం నుంచి సుమతీ సాంగ్ రిలీజ్.. కీలకపాత్రలో అనసూయ..
Sumathi Song
Follow us on

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది యాంకర్ అనసూయ. ఓవైపు పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న ఆమె.. మరోవైపు విమానం సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రానికి శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించగా.. కిరణ్ కొర్రపాటి – జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి సుమతీ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ అనసూయ పోషించిన సుమతీ పాత్రపై సాగుతుంది. ‘సుమతీ .. సుమతీ .. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత’ అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన చరణ్ అర్జున్ ఈ పాటకి సాహిత్యాన్ని అందించడమే కాదు .. ఆయనే ఆలపించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, రేలా రేలా అనే లిరికల సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.