ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు.. సుమన్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్

బిగ్ బాస్ 9 రియాలిటీ షోలో టాప్ సెవెన్ కంటెస్టెంట్‌గా నిలిచి ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. టాప్ కమెడియన్‌గా ఐదు భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి, నంది అవార్డు అందుకున్న సుమన్ శెట్టి, బిగ్ బాస్ హౌస్‌లో 14 వారాల పాటు తనదైన ముద్ర వేశాడు.

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు.. సుమన్ శెట్టి ఎమోషనల్ కామెంట్స్
Suman Shetty

Updated on: Dec 21, 2025 | 4:12 PM

సుమన్ శెట్టి.. మొన్నటి వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు , కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు ఈ టాలీవుడ్ నటుడు. గత కొంతకాలంగా సుమన్ శెట్టి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. బిగ్ బాస్ ద్వారా మరోసారి సుమన్ శెట్టి పేరు మారుమ్రోగింది. తనదైన గేమ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి. ఇక ప్రతివారం తన గేమ్ తో పాటు టాస్క్ ల్లోనూ రాణించాడు సుమన్ శెట్టి. బిగ్ బాస్ చివరి వరకు ఉండి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో 14 వారలు ఉన్నాడు సుమన్. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ స్టార్ హీరో పిలిచి తనకు సినిమా ఛాన్స్ ఇచ్చారని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అలాగే డైరెక్టర్ తేజ పట్ల తన అభిమానాన్ని వివరించారు. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో తనకు అత్యంత ఇష్టమైన హీరో ఎవరు అన్న ప్రశ్నకు, సుమన్ శెట్టి టక్కున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తో అన్నవరం, సర్దార్ గబ్బర్ సింగ్ అనే రెండు చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించిందని సుమన్ శెట్టి తెలిపారు.

అన్నవరం చిత్రం తర్వాత, సుమారు నాలుగు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ తనను గుర్తుపెట్టుకుని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తనకోసం ఒక పాత్రను ప్రత్యేకంగా కేటాయించారని సుమన్ శెట్టి తెలిపారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిపించుకుని “ఈ క్యారెక్టర్ సుమన్ కి ఇవ్వండి” అని చెప్పారని, ఆయన వల్లే తాను ఆ సినిమాలో ఛాన్స్ అందుకున్నా అని సుమన్ శెట్టి తెలిపారు. ఎంత బిజీ షెడ్యూల్స్ లో ఉన్నా పవన్ కళ్యాణ్ తనను గుర్తుంచుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అలాగే, సుమన్ శెట్టి తన గురువుగా భావించే డైరెక్టర్ తేజ గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తాను ఇల్లు కొన్నప్పుడు, ఆ ఇంటి గృహప్రవేశానికి డైరెక్టర్ తేజ గారిని ఆహ్వానించినట్లు తెలిపారు. తన ఐదు బెడ్ రూమ్‌ల డూప్లెక్స్ ఇంట్లో ఒక రూమ్‌ను తేజ గారికి ప్రత్యేకంగా కేటాయించినట్లు, ఆ గదిలో జయం సినిమాకు వచ్చిన షీల్డ్స్, తేజ గారి ఫోటోలు అన్నీ పెట్టి, “గురువు గారు, ఇది మీదే. మీరు ఎప్పుడైనా రావచ్చు” అని చెప్పినట్లు సుమన్ శెట్టి తెలిపారు. ఇప్పటికీ ఆ గదిని తేజ గారి కోసమే శుభ్రంగా ఉంచుతున్నట్లు తెలిపారు. తన ఎదుగుదలకు, నేడు తాను ఈ స్థాయిలో ఉండటానికి డైరెక్టర్ తేజ గారే ప్రధాన కారణమని సుమన్ శెట్టి స్పష్టం చేశారు. తేజ గారితో కలిసి వరుసగా ఆరు సినిమాలు చేశానని, ఆయన ఇచ్చిన అవకాశాలు, మద్దతు తన జీవితంలో ఎంతో కీలకమని ఆయన కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..