AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. రీసెంట్ డేస్ లో స్పెషల్ సాంగ్ లేకుండా సినిమాలు రావడం లేదు. చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి వెనకాడటం లేదు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించారు.

ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2025 | 11:13 AM

Share

చాలా మంది అందాల భామలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది అందాల భామలు తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది అందాల భామలు ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా సిద్ధమవుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పిస్తున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు స్పెషల్ సాంగ్స్ లో అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యింది. ఓ నలుగురు డైరెక్టర్స్ పేర్లు చెప్పి.. ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా అని చెప్పింది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమె చెప్పిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రష్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

ఇటీవలే రష్మిక గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా రష్మిక స్పెషల్ సాంగ్ చేయడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల జగపతి బాబు టాక్ షోకు రష్మిక హాజరయ్యింది. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది. తనకు విభిన్నమైన పాత్రలు చేయడం అంటే ఇష్టమని చెప్పింది. అలాగే కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ లోనూ చేస్తాను అని తెలిపింది. అలాగే తన మైండ్ లో నలుగురు దర్శకులు ఉన్నారని, వాళ్లు అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని తెలిపింది. ఆ నలుగురు తప్పితే ఎవరు అడిగినా ప్రత్యేక గీతాల్లో నటించనని చెప్పింది.. ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం రష్మిక చెప్పలేదు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us