Movie Sequels: ఈ జనరేషన్ మేకర్స్ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రెండు మూడు కథలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయటం కన్నా… ఒకే కథను రెండు మూడు సినిమాలుగా చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రాటజీతో సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి ఇన్సిపిరేషన్‌తో… బాహుబలి మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ మేకర్స్ కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాను అప్లై చేశారు. ఫస్ట్ పార్ట్‌ను మల్టీ లింగ్యువల్ రిలీజ్ చేసి పాన్ ఇండియా బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సీక్వెల్‌తో నేషనల్ మార్కెట్‌ను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఒకే కథను రెండు భాగాలుగా తీసిన ప్రశాంత్ నీల్… రెండు సినిమాల మీద హైప్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా 1 ప్లస్ 1 ఆఫర్‌కే ఓటేశారు. పుష్ప సినిమాను ఒకే పార్ట్‌గా రిలీజ్ చేయాలనుకున్నా.. కంటెంట్‌లో రెండు సినిమాలు చేసేంత స్కోప్ ఉండటంతో రెండో భాగాన్ని లైన్‌లో పెట్టారు. లాక్ డౌన్ గ్యాప్‌లో స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేసి ఫైనల్‌గా పుష్ప సీక్వెల్‌కు కర్టన్ రెయిజ్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ అయితే ఏకంగా ట్రయాలజీ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర అనే ఫాంటసీ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి సీనియర్లు కూడా కీ రోల్స్‌లో నటిస్తున్నారు.
తమిళ ఇండస్ట్రీలోనూ ఈ 1 ప్లస్ 1 ఆఫర్ సినిమాలు రెడీ అవుతున్నాయి. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. విక్రమ్, జయం రవి, కార్తీ, విక్రమ్ ప్రభు లాంటి ఫాంలో ఉన్న హీరోలంతా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా యాడ్ అవ్వటంతో పొన్నియన్ సెల్వన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు క్యాష్ చేసుకునే ఉద్దేశంతోనే సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నీ సీక్వెల్స్ బాట పట్టడంతో కొత్త ట్రెండ్ మొదలైందంటున్నారు క్రిటిక్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :