ఆహాలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ మూవీ.. “ఒక యముడి ప్రేమకథ” స్ట్రీమింగ్

సినీప్రియులు అత్యధికంగా ఇష్టపడే సౌత్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఆహాలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఒక యముడి ప్రేమకథ స్ట్రీమింగ్
Dulquer Salmaan

Updated on: Jun 05, 2025 | 5:19 PM

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ ఇంత ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాలతో, ప్రస్తుతం ఆయన నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటీ రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా ఆయన టాలీవుడ్‌ టాప్ హీరోల సరసన నిలిచారు.

ప్రస్తుతం దుల్కర్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న “కాంతా”, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న “ఆకాశంలో ఒక తారా” అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయనకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు ఆహా దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అభిమానుల మన్ననలు పొందిన “ఒరు యమండన్ ప్రేమకథ” చిత్రం, “ఒక యముడి ప్రేమకథ” పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో భవాని మీడియా విడుదల చేయనుంది. దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది మరొక మైలురాయి. అలాగే తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ, డిఫరెంట్ కంటెంట్ అందించాలన్న ఆహా సంకల్పానికి ఇది అద్దం పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.