SS Rajamouli: జక్క‌న్నకు సాటిలేరు ఎవ‌రూ.. ! ఆకాశానికెత్తేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే

|

May 08, 2021 | 3:16 PM

పాన్ ఇండియా డైరెక్టర్‌... ఈ ట్యాగ్ అందుకోవటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఆ ప్లేస్‌లో సెటిల్‌ అయిన జక్కన్న తాను ఆ పోజిషన్‌కు ఎందుకు అర్హుడో కూడా చెప్పకనే చెబుతున్నారు.

SS Rajamouli: జక్క‌న్నకు సాటిలేరు ఎవ‌రూ.. ! ఆకాశానికెత్తేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకంటే
rajamouli
Follow us on

పాన్ ఇండియా డైరెక్టర్‌… ఈ ట్యాగ్ అందుకోవటం అంత ఈజీ కాదు. ఇప్పటికే ఆ ప్లేస్‌లో సెటిల్‌ అయిన జక్కన్న తాను ఆ పోజిషన్‌కు ఎందుకు అర్హుడో కూడా చెప్పకనే చెబుతున్నారు. మేకింగ్ నుంచి ప్రమోషన్‌ వరకు ప్రతీ విషయంలో జక్కన్న మార్క్ పాన్‌ ఇండియా స్ట్రాటజీ ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతోంది. బాహుబలి పాన్ ఇండియన్ అన్న పదానికి ఇండస్ట్రీ స్క్రీన్ మీద స్థానం కల్పించిన సినిమా. తెలుగు, హిందీ.. సౌత్ నార్త్ అన్న లిమిటేషన్స్ చెరిపేసి ఇండియన్ సినిమా అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న సినిమా. ఈ రేంజ్‌ సినిమా తెరకెక్కటం వెనుక దర్శకుడిగా కృషి చాలానే ఉంటుంది. ముఖ్యంగా అన్ని భాషలను, అన్ని భాషల నటీనటులను, అన్ని ప్రాంతాల ఆడియన్స్‌ను జక్కన్న ఎలా మ్యానేజ్‌ చేశారు.

రాజమౌళి భాషా పరిజ్ఞానం ఈ విషయంలో చాలానే హెల్ప్ అయ్యింది. తెలుగు సినీ ప్రముఖులంతా చెన్నై నుంచి వచ్చినవారే అందుకే మన వాళ్లకు తెలుగు, తమిళ భాషలు కొట్టిన పిండే. అయితే రాజమౌళికి మరో అడ్వాంటేజ్‌ ఉంది. ఆయన ఫ్యామిలీకి కర్ణాటకతో మంచి అనుబంధం ఉంది. ఆ భాషతోనూ మంచి పరిచయం ఉంది. పాన్‌ ఇండియా సినిమా చేయాలనుకున్న జక్కన్న హిందీలో కూడా పట్టు సాధించారు. బాలీవుడ్‌లో బాహుబలిని భారీగా ప్రమోట్‌ చేసే క్రమంలో జక్కన్నను మనవాడే అన్నంతగా ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఓన్‌ చేసుకోవటం వెనుక జక్కన్న హిందీ ఫ్ల్యూయన్సీ కూడా హెల్ప్‌ అయ్యింది. అంతేకాదు బాలీవుడ్ నటులను డీల్ చేయటంలోనూ హిందీ ప్రావీణ్యం ఉపయోగపడింది.

ఇవన్నీ ఒక ఎత్తు.. మరి మలయాళ భాషతో పరిచయం ఎలా..? తాజాగా కోవిడ్‌ అవేర్నెస్‌ వీడియోలో జక్కన్న మలయాళ పదాలు ఉచ్చరించిన తీరు అద్భుతం అంటున్నారు ఫ్యాన్స్‌. అంతేకాదు… ఆప్రాంతం తోనూ భాషతోనూ ఏ మాత్రం సంబంధం లేకపోయినా పర్ఫెక్ట్‌గా లాంగ్వేజ్‌ నేర్చుకోని.. ఆ భాషలో సందేశం ఇవ్వటంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే జక్కన్న పాన్‌ ఇండియా దర్శకుడిగా ఎదిగారంటూ ఆకాశానికెత్తేస్తున్నారు ఫ్యాన్స్‌.

Also Read: చిన్నారికి ప్రాణం పోసిన సామాన్యులు, నెలన్నర రోజులలోపే 16 కోట్ల విరాళాల సేకరణ

అందాల నిధికి అదిరే ఆఫ‌ర్లు.. అయినా నిస్తేజం.. ఎందుకంటే..?