SS Rajamouli: ఏపీ సీఎం జగన్‏తో సమావేశం కానున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ విడుదల కోసం చర్చ.. ?

|

Mar 14, 2022 | 2:06 PM

డైరెక్టర్ రాజమౌళి ఏపీ సీఎం జగన్‏ను కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో

SS Rajamouli: ఏపీ సీఎం జగన్‏తో సమావేశం కానున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ విడుదల కోసం చర్చ.. ?
Rajamouli
Follow us on

డైరెక్టర్ రాజమౌళి ఏపీ సీఎం జగన్‏ను కలవనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాజమౌళి.. కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా విజయవాడకు బయలుదేరారు.. ఈనెల 25న ఆర్ఆర్ ఆర్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి సీఎం జగన్‏ను కలవనున్నట్లు సమాచారం. రాజమౌళితోపాటు.. ప్రొడ్యుసర్ దానయ్య కూడా జగన్‏తో భేటీ కానున్నారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అలియా భట్.. అజయ్ దేవ్ గణ్.. శ్రియ సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ మూవీపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.