
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 పేరుతో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా.. కొన్నాళ్ల క్రితం విడుదలైన మహేష్ బాబు ప్రీ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ తోపాటు మహేష్ ఫుల్ లుక్ రివీల్ చేయనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల హీరోయిన్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేశారు జక్కన్న. ఇక ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు విజువల్ వండర్ సైతం ఉండనున్నట్లు జక్కన్న పోస్ట్ చేశారు. మరోవైపు కాసేపట్లో ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు.
నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు.. ఆయనెప్పుడూ ఒక పౌరాణిక సినిమా చేయమనేవారు.. ఆ మాట నేను వినలేదు.. ఈ రోజు నా మాటలు ఆయన వింటూ ఉంటారు.. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి.. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఇ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్.. నా దర్శకుడిని గర్వపడేలా చేస్తా.. వారణాసి రిలీజ్ అయినపుడు ఇండియా మొత్తం మమ్మల్ని చూసి గర్వపడుతుంది.. ఇది టైటిల్ రివీల్ మాత్రమే.. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అనేది మీకు చాలా చిన్నమాట..
కొంచెం కొత్తగా ఉంది.. కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవడం. స్టేజీ మీదకు నడుచుకుంటూ వస్తా అంటే నో అన్నాడు.. అన్నింటికీ రాజమౌళి కుదరదు అంటున్నాడు.. ఇదంతా మీకోసమే.. నెక్ట్స్ చొక్కా లేకుండా రమ్మంటాడేమో..? అప్‌డేట్ అప్‌డేట్ అని అడిగారుగా.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది..అని అన్నారు.
నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు.. నాన్నగారూ వచ్చి హనుమ వెనకాల ఉంటాడు.. నడిపిస్తాడన్నాడు.. ఇదేనా నడిపించేది అని కోపం వచ్చింది.. ఏంటి ఇదేనా చేసేదా అని మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది. నా చిన్నప్పటి నుంచి రామాయణం భారతం ఇష్టమని.. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సినిమా మొదలుపెట్టినపుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తాననుకోలేదు.. ఇందులో ఒక్కో సీన్ రాస్తుంటే, డైలాగ్ రాస్తుంటే నేల మీద లేను నేను.. సినిమాలో రాముడిగా మహేష్ కనిపించాడు.. గూస్ బంప్స్ వచ్చాయి.. అని అన్నారు.
మహేష్ బాబు గురించి మాట్లాడాలి.. సినిమా గురించి, నటన గురించి కాదు.. ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి.. అందరూ నేర్చుకోవాలనుకునే గుణం ఉంది.. మనందరికీ సెల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది.. ఆఫీస్‌కు వచ్చాడు, షూటింగ్‌కు వచ్చాడంటూ సెల్ ఫోన్ ముట్టుకోడు.. మళ్లీ వెళ్లేటప్పుడే ఫోన్ టచ్ చేస్తాడు. అందరం పాటించాలి.. నీలా ఉండటానికి ట్రై చేస్తాను అంటూ మహేష్ గురించి చెప్పుకొచ్చాడు జక్కన్న.
ఏడాది పాటు కష్టపడిన వీడియోను సింపుల్‌గా డ్రోన్‌లో పెట్టి లీక్ చేసారు. టెక్నికల్ రీజన్స్‌తో గ్లిచ్చెస్ వస్తున్నాయి. పవర్ సరిపోవట్లేదు అని అన్నారు రాజమౌళి.
రాజమౌళి మాట్లాడుతూ.. ” ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా చేసినందుకు పోలీసులకు థ్యాంక్యూ.. కేఎల్ నారాయణ గారూ నన్ను, మహేష్‌ను కలిపినందుకు థ్యాంక్యూ.. నేను ప్రతీ సినిమా ముందు ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పాను.. కొన్ని సినిమాలకు కుదురుతుంది.. ఈ సినిమాకు మాటలు సరిపోవు.. ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు. కథ చెప్పకూడదు.. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేసాం. మార్చ్ నుంచి ప్లాన్ చేసాం.. జూన్, జులై అలా అన్ని అయిపోయాయి.. నవంబర్‌లో వస్తున్నాం. చిన్నపుడు నాకు కృష్ణ గారి గొప్పతనం తెలియదు.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమయ్యాక ఆయన గొప్పతనం అర్థమైంది. కొత్త టెక్నాలజీని పరిచయం చేయడానికి ఎన్నో దారులు వేయాలి. అలాంటిది కృష్ణ గారూ ఎన్నో పరిచయం చేసారు.. సినిమా స్కోప్ అల్లూరి, ఈస్ట్ మెన్ కలర్ ఈనాడు, ఫస్ట్ 70ఎంఎం సింహాసనం ఇంట్రడ్యూస్ చేసారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు ప్రీమియమ్ లార్జ్ స్కేల్ సినిమా ఫర్ ఐమాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఐమాక్స్‌లో ప్రొడ్యూస్ చేసి 1 ఇష్టూ 1.9 ఫార్మాట్‌లో షూట్ చేసాం. ఇది ఫుల్ స్క్రీన్ ఫార్మాట్ ” అని అన్నారు.
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. “ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్యూ.. సినిమాను సెలబ్రేషన్ చేసుకునే ల్యాండ్ ఇది. దిగ్గజాలతో నటించడం గర్వంగా ఉంది. పృథ్వీ నువ్వు చాలా భయపెడుతున్నావ్ సినిమాలో.. రాజమౌళి గారూ మీరు చాలా విజనరీ.. ఇండియన్ సినిమాను ఇంతకుముందు ఎవరూ తీసుకెళ్లలేని రేంజ్‌లో గ్లోబల్‌కు తీసుకెళ్తున్నారు.. మిగిలిన టీంకు థ్యాంక్యూ. బాబ్.. లయన్.. అని మీరు పిలుస్తారు.. కానీ నాకు MB, లెజెండరీగా తెలుసు.. అతడే మహేష్ బాబు..
థ్యాంక్యూ అందరికీ.. మీ అందర్నీ గర్వపడేలా చేస్తాను..” అని అన్నారు.
గత పాతికేళ్లలో చాలా ఇండస్ట్రీల్లో ఎన్నో సినిమాలు చేసాను.. కానీ ఇంతమందితో సినిమా లాంఛ్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. మలయాళంలో ఎన్నో క్లాసిక్స్ చూస్తూ పెరిగాను. ఈ సినిమాతో టీమ్ అవ్వడం సంతోషంగా ఉంది.”హాయ్ పృథ్వీ.. నేను రాజమౌళి.. నా నెక్ట్స్ సినిమాలో ఒక విలన్ రోల్ ఉంది.. నీకు ఇష్టమైతే విలన్‌గా నటిస్తావా..? అని అడిగారు.5 నిమిషాల నెరేషన్‌తో నేను కథలోకి వెళ్లిపోయా.. కామిక్ బుక్స్‌ను చిన్న పిల్లాడు చదువుతున్నట్లు లీనమైపోయాను. సినిమా మొదటి 5 నిమిషాల గురించి రిలీజ్ రోజు మాట్లాడుకుంటారు. ఇలాంటి కథ రాజమౌళి ఎలా ఊహించుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్యూ.. మీ టార్చరస్ షూటింగ్‌కు థ్యాంక్యూ.. ఈ సినిమా మీకు అవసరం.. మీరు ఈ సినిమాకు అవసరం.. మహేష్ బాబు గారూ.. ప్రియాంక చోప్రా నువ్వు మందాకినిగా ట్రాన్స్‌ఫామ్ అవ్వడం అద్భుతంగా ఉంది.. ఇండియన్ సినిమాను రాజమౌళి ఈసారి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు..
“పంచంలోనే అతి భయంకరమైన, పవర్ ఫుల్ వ్యక్తి ఉన్నాడు.. కల కన్నాడు.. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకుని జనం పిచ్చోడని వెక్కిరించారు.. ఎగతాళి చేసారు. కానీ ఆ కల వెనక కథ విన్న తర్వాత వారి గుండెల్లో గజగజ వణికే మంచు పర్వతాలు కరిగాయి. అతడి ఆలోచన విలయం” అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా సాంగ్ విడుదల చేశారు..
స్టూడెంట్ నెం 1 నుంచి ఆస్కార్ వరకు తమ్ముడు రాజమౌళితో నేను సాగించిన ప్రయాణంలో ఎంతో విడ్డూరాలు జరిగాయి. ట్రిపుల్ ఆర్‌తో ఇంకో సైడ్ ఆఫ్ గ్లోబ్‌కు ట్రావెల్ చేసాం. గ్లోబ్ అంటే ఎన్నో దేశాలు, ఖండాలు, వింతలు ఉన్నాయి.. అవన్నీ ఆవిష్కరించడానికి ఈ గ్లోబ్ ట్రాటర్ సినిమాతో చూపిస్తున్నాం. ధైర్యం చేసి పెద్ద పని చేస్తున్న ఎస్ గోపాల్ రెడ్డి, రాజమౌళి, కేఎల్ నారాయణకు థ్యాంక్స్. మహేష్ బాబుకు కూడా నేను పెద్ద ఫ్యాన్. పోకిరి ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తు లేదు. అని అన్నారు కీరవాణి.
ఈ కార్యక్రమంలో టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. వారణాసి విజువల్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నానని అన్నారు.
ఒక్కోసారి మాట్లాడటానికి మాటలు రావు.. కొన్నిసార్లు ఉన్నా చెప్పలేం. ఈ సినిమాలో 30 నిమిషాల లెంత్ ఉంది.. అలా చూస్తుండిపోయాను మహేష్ బాబు విశ్వరూపం అందులో. సీజీ లేదు, బ్యాగ్రౌండ్ లేదు ఏం లేకపోయినా మహేష్ విశ్వరూపం చూపించాడు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు.. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నాడు.. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమకు రామనామం ఇష్టం..అని అన్నారు..
రాజమౌళి తనయుడు కార్తికేయ స్టేజ్ పై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న రమా రాజమౌళి ఎమోషనల్ అయ్యారు.
15 ఏళ్ళ కింద మహేష్ బాబు, రాజమౌళి గారితో సినిమా చేద్దామనుకున్నాం.. కానీ ఇంత టైమ్ పడుతుందని ఊహించలేదు.. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగే మహేష్ కూడా ప్రొడ్యూసర్స్ హీరో. 15 ఏళ్ల కింద రాజమౌళి గారిని కూడా అడిగినపుడు ఓకే అన్నారు.. గత 15 ఏళ్లలో ఈగ, బాహుబలి, ట్రిపుల్ ఆర్ వచ్చాయి.. డైరెక్టర్‌గా ఎంత ఎత్తుకు ఎదిగినా.. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. సేమ్ సింప్లిసిటీ, సేమ్ కమిట్‌మెంట్. థ్యాంక్యూ మీ కమిట్‌మెంట్‌కు.. ఇండియన్ హీరోయిన్ అయినా కూడా హాలీవుడ్‌కు వెళ్లి ఇండియన్ సినిమా డైమెన్షన్స్ మార్చింది ప్రియాంక చోప్రా.. థ్యాంక్యూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రాజమౌళి కథ చెప్పగానే ఓకే అన్నారు.. క్షణక్షణం సమయంలో అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్.. కానీ ఇప్పుడు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు.. లార్జెర్ దెన్ లైఫ్ సినిమా అవుతుంది మీకు.. ఇది చాలా త్వరగా వస్తుంది.. పోలీసులకు థ్యాంక్యూ..
గ్లోబ్ ట్రోటర్ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. సుపు రంగు లో-నెక్ కుర్తా, గోధుమ రంగు కోటు, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి, మెడలో రుద్రాక్షతో సింపుల్ అండ్ స్టైలీష్ లుక్ లో కనిపించారు మహేష్.
Mahesh
గ్లోబ్ ట్రోటర్ వేడుకకు దేవకన్యలా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. వైట్ కలర్ లెహాంగాలో భారీ ఆభరణాలతో మరింత అందంగా మెరిసిపోయింది.
Priyanka
అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ముందు నుంచి ఊహించినట్లుగా మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు వారణాసి అని టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే టైటిల్ గ్లింప్స్ లో ఎద్దుపై మహేష్ స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపించారు. అయితే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కథ అని చాలా మంది సందేహపడుతున్నారు.
గ్లోబ్ ట్రోటర్ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
Ghattamanenis are here ❤️🔥#GlobeTrotter @urstrulyMahesh pic.twitter.com/9aGDgrdsmH
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 15, 2025
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసింది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు మహేష్.. ఎద్దు పై స్వారీ చేస్తూ వస్తున్న విజువల్స్ అదిరిపోయాయి.
#VARANASI 💥🔥🔥🔥🔥🔥🔥🔥
JAI BABU @urstrulyMahesh 🦁🦁🦁#GlobeTrotter #SSMB29 pic.twitter.com/nviB8jIeUq
— ☆ Loyal Maheshians ☆ (@LoyalMaheshians) November 15, 2025
మహేష్ బాబు ఎద్దును స్వారీ చేస్తున్న వీడియోను అభిమానులు షేర్ చేశారు, ఆ తర్వాత స్క్రీన్‌పై వారణాసి అనే పదం మెరుస్తూ ఉంది – ఇది ఎస్ఎస్ రాజమౌళి చిత్రానికి వారణాసి అని ఫిక్స్ చేశారు.
Edhi Chalu Saami 🔥🔥🔥🥵🥵🥵#GlobeTrotter #GlobeTrotterEvent pic.twitter.com/9cKkbKIcSQ
— GlobeTrotter Fan Club (@GlobetrotterOfl) November 15, 2025
ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే వందలాది మంది అభిమానులు వేదిక వద్ద సందడి చేస్తుండగా.. ఎప్పుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబం వేదిక వద్దకు చేరుకుంది.
అభిమానులు ఎదురుచూస్తున్న గ్లోబ్ ట్రోటర్ వేదికపై సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు రాజమౌళి తెలిపారు. ఈవెంట్‌లో స్క్రీన్ పై మూవీ థీమ్ ఏంటనేది వీడియో రూపంలో ప్లే చేయనున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ లోునూ ఆ వీడియోను షేర్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు.
The title of the film will be revealed along with a visual to the world…
Once it airs on the big screen at the #GlobeTrotter event, we will make it live online…. 🤗🤗🤗
— rajamouli ss (@ssrajamouli) November 15, 2025
గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబు, రాజమౌళి పోస్టర్లతో కార్లు, బైక్ ర్యాలీలతో ఈవెంట్ వద్దకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.
'JAI BABU’ Mode Activated 🦁🔥#GlobeTrotter #SSMB29
— C H I N N U❤️🔥 (@Chinnuu09) November 15, 2025
Babu Lake Babu Mahesh BABU✊🏻#GlobeTrotter #SSMB29 pic.twitter.com/UjBiLtYtBY
— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) November 15, 2025
మరికాసేపట్లో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఈక్రమంలో ఇప్పటికే వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికాగా.. వేదిక వద్దకు మహేష్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ భారీగా చేరుకుంటున్నారు. పాస్ లు ఉన్నవారు వేదిక వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
India's Biggest SuperStar Is Coming🥵🔥#GlobeTrotter #GlobeTrotterEvent #SSRajaMouli #SSMB29
— PANDIT🏴☠️🦈 (@TweetFactsnly) November 15, 2025
ప్రస్తుతం ఘట్టమనేని అభిమానులు, భారతీయ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మరికాసేపట్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB 29 టైటిల్ రివీల్ చేయనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న ఈమూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు జక్కన్న.