AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: మహేశ్ మూవీ పాన్ వరల్డ్.. కన్ఫామ్ చేసేసిన రాజమౌళి.. జోనర్ ఏంటంటే..?

రాజమౌళి సినిమా చూస్తేనే కాదు.. ఆయన ప్లానింగ్ చూసినా సరే అద్భుతం అనాల్సిందే. అంతలా సినిమాకు మార్కెట్ ఏర్పాటు చేసుకుంటారు జక్కన్న.

SS Rajamouli: మహేశ్ మూవీ పాన్ వరల్డ్.. కన్ఫామ్ చేసేసిన రాజమౌళి.. జోనర్ ఏంటంటే..?
Mahesh Babu - Rajamouli
Ram Naramaneni
|

Updated on: Dec 02, 2022 | 1:18 PM

Share

స్ట్రాటజీ ప్లే చేయడంలో తన తర్వాతే ఎవరైనా అంటున్నారు రాజమౌళి. 400 కోట్ల బడ్జెట్ పెట్టించినా.. నిర్మాత నిశ్చింతగా ఉండేలా తనదైన ప్లానింగ్ చేస్తుంటారు జక్కన్న. పదేళ్ళ కింద ఈగ నుంచే ఈ స్ట్రాటజీ మొదలైంది. తాజాగా మహేష్ బాబు కోసం మరోసారి ఇదే చేయబోతున్నారు దర్శకధీరుడు. దీనికోసం ఏకంగా పాన్ వరల్డ్ ప్రణాళికలు మొదలయ్యాయి. ఓ సినిమాకు 100 కోట్లు బడ్జెట్ పెడితేనే అవి తిరిగొచ్చే వరకు దర్శక నిర్మాతలకు కంటి మీద కునుకు ఉండదు. కానీ రాజమౌళికి మాత్రం ఆ బాధ ఉండదు.. ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు కూడా కంగారు లేకుండా ఉంటారు. దానికి కారణం జక్కన్న ప్లానింగ్. తానెలాంటి సినిమా చేస్తారో దానికి తగ్గ ప్రణాళికలు రచిస్తుంటారు రాజమౌళి. ముఖ్యంగా ఆర్టిస్టుల ఎంపికలో జక్కన్న మాస్టర్.

ఈగ ముందు వరకు కేవలం తెలుగు నటులకే ఎక్కువ ఛాన్సులిచ్చారు జక్కన్న. కానీ ఈగ నుంచి ప్లానింగ్ మారిపోయింది. ఇతర భాషల్లోనూ దాన్ని అనువదించాలనుకున్నపుడు.. కన్నడ నుంచి స్టార్ హీరో సుదీప్‌ను విలన్‌గా తీసుకున్నారు. దాంతో అటు కన్నడ.. ఇటు హిందీలో ఈగపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాహుబలికి తెలుగు, తమిళం నుంచి సమానంగా నటులను తీసుకుని.. పాన్ ఇండియా రూపమిచ్చారు.

తీసుకునే కథా నేపథ్యం బట్టి హాలీవుడ్‌ను కూడా టచ్ చేస్తున్నారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్‌లో విలన్‌గా ఫారెన్ ఆర్టిస్టులను తీసుకుని.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా క్రేజ్ తీసుకొచ్చారు. బాహుబలితో ఇండియా షేక్ అయితే.. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచమంతా రాజమౌళి పేరు తెలిసిపోయింది. తాజాగా మహేష్ కోసం ఎక్కువగా హాలీవుడ్ ఆర్టిస్టులనే తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2023 సెకండాఫ్‌లో ఈ సినిమా మొదలు పెట్టనున్నట్లు టాక్.

పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రానున్న మహేష్ బాబు సినిమాలో నటుల కోసం ఇప్పటికే అమెరికన్ టాలెంట్ ఏజెన్సీ అయిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో టై అప్ అయ్యారు రాజమౌళి. దాంతో పాటు పారిస్‌లోని ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీతోనూ జత కట్టారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగే హై యాక్షన్ డ్రామాగా మహేష్ సినిమా రానుందని తెలిపారు జక్కన్న. దాదాపు రూ.600 కోట్లతో సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ కొత్త రిజర్వేషన్‌‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
ఈ కొత్త రిజర్వేషన్‌‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు
చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు