Sruthi Hariharan: హేమ కమిటీలా మాకు ఓ కమిటీ వేయండి.. హీరోయిన్ రిక్వెస్ట్

సమంత కూడా మాట్లాడుతూ.. టాలీవుడ్‌లోనూ హేమకమిటీ తరహా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చింది. తాజాగా మరో హీరోయిన్ మాట్లాడుతూ తమ ఇండస్ట్రీకి కూడా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. కన్నడ నటి శ్రుతి హరిహరన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. . కన్నడలో అలాంటి కమిటీ అవసరం ఉందని ఆమె అన్నారు.

Sruthi Hariharan: హేమ కమిటీలా మాకు ఓ కమిటీ వేయండి.. హీరోయిన్ రిక్వెస్ట్
Sruthi Hariharan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2024 | 1:44 PM

జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, దోపిడీలపై హేమ కమిటీ ఓ నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక 2019లోనే ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి. దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. హీరోయిన్స్ చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను దైర్యంగా బయటకు చెప్తున్నారు. సమంత కూడా మాట్లాడుతూ.. టాలీవుడ్‌లోనూ హేమకమిటీ తరహా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చింది. తాజాగా మరో హీరోయిన్ మాట్లాడుతూ తమ ఇండస్ట్రీకి కూడా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. కన్నడ నటి శ్రుతి హరిహరన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. . కన్నడలో అలాంటి కమిటీ అవసరం ఉందని ఆమె అన్నారు.

‘హేమ కమిటీ నివేదికపై నాకు చాలా గౌరవం ఉంది. దీని గురించి మనం చాలా కాలంగా మూసిన తలుపుల వెనుక మాట్లాడుతున్నాము. సెక్స్ ఫేవర్ చాలా ఎక్కువ అని మనం చెప్పుకునేవాళ్లం. దీని గురించి మన సన్నిహిత వర్గాలలో కొందరు జోకులు వేసేవారు. అయినా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం గర్వించదగ్గ విషయం’ అని ఆమె అన్నారు.

‘ఈ రిపోర్టు మలయాళ సినిమా గౌరవాన్ని దిగజార్చేలా ఉందని, మలయాళ సినిమా పరువుకు భంగం కలిగిస్తోందని’ కందరు అంటున్నారు. అయితే శృతి హరిహరన్ మాత్రం దీన్ని తప్పు పట్టింది. ‘ఇది ఖచ్చితంగా అది తప్పు. దాన్ని అలా చూడకండి. సినిమా అనేది కళకు సంబంధించినది. దానిలోని కొన్ని ఆలోచనలను మార్చడానికి ఇది సరైన సమయం. మన ఇంటిని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి’ అని శృతి హరిహరన్ అన్నారు. కన్నడలో కూడా ఈ తరహా కమిటీ వేయాలని శ్రుతి హరిహరన్ అభిప్రాయపడ్డారు. అలాగే శృతి హరిహరన్ తన సినిమాల గురించి మాట్లాడింది. కన్నడలో చిరుత అనే సినిమాకు సంతకం చేశాను. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి