Srikaram Trailer: ‘తినేవాళ్లు మన నెత్తి మీద జుట్టంత ఉంటే.. పండించే వాళ్లు మూతిపై మీసమంత కూడా లేరు’.. సరికొత్త శ్రీకారం..

|

Feb 09, 2021 | 7:26 PM

Srikaram Trailer Out: రైతులు.. సమాజంలో వీరికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం ఎంత అభివృద్ధి దిశలో దూసుకెళ్లినా పండించే రైతు లేకుంటే ఆ అభివృద్ధి...

Srikaram Trailer: తినేవాళ్లు మన నెత్తి మీద జుట్టంత ఉంటే.. పండించే వాళ్లు మూతిపై మీసమంత కూడా లేరు.. సరికొత్త శ్రీకారం..
Follow us on

Srikaram Trailer Out: రైతులు.. సమాజంలో వీరికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం ఎంత అభివృద్ధి దిశలో దూసుకెళ్లినా పండించే రైతు లేకుంటే ఆ అభివృద్ధి అసంపూర్తే అని చెబుతుంటారు. ఇక రైతుల గొప్పతనాన్ని వివరిస్తూ.. వారి ప్రాముఖ్యతను చాటుతూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.
తాజాగా అలాంటి కోవలోకే వస్తుంది మరో తెలుగు సినిమా ‘శ్రీకారం’. శర్వానంద్‌, ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ జంటగా తెరకెక్కుతోన్న శ్రీకారం సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ను గమనిస్తే సినిమా మొత్తం రైతు, వ్యవసాయం నేపథ్యంలో సాగనున్నట్లు అర్థమవుతోంది. ‘ఒక హీరో తన కొడుకును హీరోను చేస్తున్నాడు. ఒక డాక్టర్‌ తన కొడుకును డాక్టర్‌ చేస్తున్నాడు. ఒక ఇంజనీర్‌ తన కొడుకును ఇంజనీర్‌ చేస్తున్నాడు. కానీ.. ఒక రైతు మాత్రం తన కొడుకును రైతు చేయట్లేదు. ఈ ఒక్కటి నాకు జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది’ అంటూ మొదలైన ట్రైలర్‌ సినిమా కథ చెప్పకనే చెబుతోంది. దేశంలో రైతు ఎదుర్కొంటున్న కష్టాలకు ఓ రైతు ఎలాంటి పరిష్కారం చూపాడు, ఇందుకోసం ఎలాంటి శ్రీకారం చుట్టాడు లాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేయనున్నారు.

Also Read: రిపబ్లిక్ దినోత్సవం నాటి అల్లర్ల సూత్రధారి పంజాబీ నటుడు దీప్ సిద్దుకి 7 రోజుల పోలీస్ కస్టడీ,