Dongalunnaru Jagratha : మూడో సినిమా మొదలు పెట్టిన కుర్ర హీరో.. దొంగలున్నారు జాగ్రత్త అంటున్న శ్రీ సింహ..

|

Feb 23, 2022 | 8:49 PM

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత‌ డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబి చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Dongalunnaru Jagratha : మూడో సినిమా మొదలు పెట్టిన కుర్ర హీరో.. దొంగలున్నారు జాగ్రత్త అంటున్న శ్రీ సింహ..
Sri Simha K
Follow us on

Dongalunnaru Jagratha: సురేష్ ప్రొడక్షన్స్ అధినేత‌ డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబి చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం వారి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న రెండవ చిత్రం శాకిని ఢాకిని విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ సింహ కోడూరితో సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిలింస్ మూడ‌వ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ  సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దొంగలున్నారు జాగ్రత్త అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రత్యేకంగా మరియు ఆసక్తికరంగా ఉంది. రోడ్డుపై కారుతో పాటు CC కెమెరా, కేబుల్‌తో కుర్చీకి కట్టివేయబడి శ్రీ సింహ కోడూరి అరుస్తూ కనిపించారు. టైటిల్ లోగో ఆకట్టుకునేలా ఉంది. ఈ డిఫ‌రెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీని పెంచేలాఉంది. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక బృందం కూడా పనిచేస్తుంది. మ‌త్తువ‌ద‌ల‌రా ఫేమ్ కాల భైరవ సంగీతం అందిస్తుండ‌గా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దొంగ‌లున్నారు జాగ్ర‌త్త   షూటింగ్ ప్రస్తుతం చివ‌రిద‌శ‌లో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : న్యూ లుక్ తో కేక పుట్టిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..