
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే శ్రీలీల అనే చెప్పుకొవాలి. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు ఏకంగా చేతిలో పది సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. మాస్ మాహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ కోసం వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్నది.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది. ఈక్రమంలోనే మరో మెగా హీరో సినిమాలో నటించనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల పాత్ర వివరాలను తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచుకునే అందమైన ‘చిత్ర’ పాత్రను పోషిస్తున్నారు. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయి. త్వరలోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఈ మూవీ నుంచి అదిరిపోయే యాక్షన్ గ్లింప్స్ విడుదల కానుంది. ఎ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. PVT04 నుంచి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Meet our Chitra – a heart stealer! Gorgeous and highly talented @sreeleela14 is playing #Chitra in #PVT04 ❤️?
#PVT04Glimpse announcement today! ?#PanjaVaisshnavTej #JojuGeorge @aparnaDasss @gvprakash #SrikanthNReddy @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/nKcfsXEUWl
— Sithara Entertainments (@SitharaEnts) May 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.