ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన అరోగ్యం విషమంగానే ఉన్నట్టుగా ప్రకటించింది. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సపోర్ట్‌తో చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో అపోలో ఆసుపత్రిలో జయలలిత చివరి దశలో ఉన్నప్పుడు ఇదే విధంగా ఎక్మో సిస్టమ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు వైద్యులు.
కాగా నిన్న ఎస్పీ బాలసుబ్రమణ్యంకు వెంటిలేటర్ తొలగించారని, ఆయన కోలుకుంటున్నట్లు ఎస్సీ శైలజ వాయిస్ మెసేజ్ పంపారు. కానీ ఇంతలోనే ఆయన పరిస్థితి విషమించినట్టు ప్రస్తుత బులిటెన్ ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఎస్పీబీ కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు జరుపుతున్నారు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షింస్తున్నారు.
Also Read:
ఇసుక విధానంలో మార్పులు, మరోసారి జగన్ మార్క్ నిర్ణయాలు !
దారుణం : కూతురి అభ్యంతకర చిత్రాలు ల్యాప్‌టాప్‌లో బంధించిన తండ్రి