Tollywood: ఈ ఫోటోలోని ముగ్గురూ టాలీవుడ్ లెజెండ్స్.. సెంటర్‌లోని వ్యక్తి స్వరమహర్షి

|

Mar 25, 2023 | 11:08 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయం అవసరములేని పేరు..తన గానంతో కోట్లాది మంది ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందిన సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .. మధురమైన గాత్రం, సంగీతంపై విశేషమైన పట్టున్న గాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యాం.. తెరపై కనిపించే నటులే పాడుతున్నారా అనిపించేలా గాత్రం మార్చి పాడడం బాలుకే సాధ్యం.

Tollywood: ఈ ఫోటోలోని ముగ్గురూ టాలీవుడ్ లెజెండ్స్.. సెంటర్‌లోని వ్యక్తి స్వరమహర్షి
Tollywood Viral Photo
Follow us on

సుస్వరాల గానం.. కళామతల్లికి స్వరాభిషేకం.. అర్ధ శతాబ్దంపాటు.. అబాలగోపాలాన్ని అలరించిన గానమయ్య.. మన బాలసుబ్రహ్మణ్యం. బాలుడై వచ్చి… గానంమై పలికి.. మూడు తరాలను రంజింపజేసిన అపర గాయకుడు. చరిత్ర చూడని గానగంధర్వుడు. యావత్‌ భారతావనిని తన గానామృతంతో ఓలలాడించిన స్వరరూపం ఆయన.  శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం… ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 ఏళ్లు సంగీత యజ్ఞం చేసిన స్వరమహర్షి. అలాంటి గాయకుణ్ని ఎలా సత్కరించుకున్నా ఆయన చేసిన కృషికి తక్కువే.

నెల్లూరులో పుట్టి.. చెన్నైలో స్థిరపడినా తన స్వరమాధుర్యంతో ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకొని అందరివాడైపోయారు మన బాలు. సంగీతంలో ఓనమాలు కూడా తెలియని అతి సామాన్యమైన వ్యక్తి ఇంతటి కీర్తి శిఖరాలును అధిరోహిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని వింటూ ఉంటాం కానీ ఎస్పీబీని చూస్తే మాత్రం అది రియాల్టీలో కనిపిస్తుంది. అంతటి శ్రమజీవి కాబట్టే సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇంకొన్నేళ్ల పాటు తన గానామృతంతో మనల్ని మైమరిపిస్తారని అనుకుంటున్న టైంలో స్వరసామ్రాట్ గాత్రం మూగబోయింది. కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన పాటను మనకు వదిలిపెట్టి దుఖసాగరంలో అందర్నీ ఉంచేసి ఈ లోకాన్నే విడిచిపెట్టి వేళ్లారు. ఆయన లేకున్నా ఆయన గానం అమరం.

తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలు కూడా సంగీతం పట్ల ఆకర్షితుడయ్యారు..తల్లీ కోరిక మేరకు ఇంజనీరింగ్‌లో చేరిన సింగింగ్‌ కాంపీటిషన్స్‌ పాల్గొంటూనే ఉండేవారు..1964లో తొలి అవార్డు అందుకున్న తర్వాత ఇళయరాజాతో కలిసి ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టార్ట్‌ చేశారు.. అది ఆయ‌న జీవితంలో ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింది. దీని త‌ర్వాత సంగీత ద‌ర్శకుడు ఎస్‌పీ కోదండ‌పాణి ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. ఆ సమయంలోదే పైన మీరు చూస్తున్న ఫోటో.

సంగీత ప్రపంచానికి అరవై ఏళ్ల నాడు ఓ గాన గంధర్వుని అందిస్తున్నామని వారు ఊహించి ఉండరు. ఆయన ఓ గాయక కర్మాగారంగా రూపుదిద్దుకుంటాడని కనీసం అనుకుని ఉండరు. ఆ ఫోటోలో బాలుతో కరచాలనం చేస్తున్న వ్యక్తి నాటి మేటి హాస్య నటులు పద్మనాభం. ఎడమవైపు ఉన్నవారు ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ పి కోదండ పాణి. ఈ ఇద్దరు బాలుకు సినిమాలో మొదటి అవకాశం ఇచ్చారు. పద్మనాభం నిర్మాతగా వ్యవహరించిన రేఖా, మురళీ పిక్చర్స్..  శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో తొలి పాట పాడారు బాలు. ఆ సందర్భంగా తీసిన చిత్రం ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..